ETV Bharat / state

ఆక్సిజన్‌, ఐసీయూ వైద్యం కోసం పెరిగిన చేరికలు

author img

By

Published : May 1, 2021, 7:07 AM IST

గత వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం... ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు కలిపి కొత్తగా 14 శాతం బెడ్‌లు అందుబాటులోకి తెచ్చింది. కానీ, కరోనా తీవ్రత పెరగడం ఆక్సిజన్‌, ఐసీయూ వైద్యం అత్యవసరం కావడంతో కొత్తగా 32 శాతం చేరికలు జరిగాయి. వారం రోజుల్లోనే 55.44 శాతం ఉన్న పడకల ఆక్యుపెన్సీ శుక్రవారానికి 64 శాతానికి చేరింది.

government-decided-to-permits-more-private-hospitals-for-corona-treatment
ఆక్సిజన్‌, ఐసీయూ వైద్యం కోసం పెరిగిన చేరికలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కారణంగా బాధితుల ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలపై చికిత్సలు జరుగుతున్నాయి. గడచిన ఐదు రోజులుగా కరోనా పాజిటివ్‌ రేటు దాదాపు పది శాతం చేరువలో నమోదవుతోంది. బాధితుల సంఖ్య పెరగడంతో అత్యవసర వైద్యానికి డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు వేగంగా నిండుతున్నాయి.

పడకల సంఖ్యను పెంచి..

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉస్మానియా, గాంధీ, టిమ్స్‌లో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు స్వల్ప సంఖ్యలో మినహా మిగతా ఆసుపత్రుల్లో వాటి లభ్యత కష్టమవుతోంది. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోనూ పడకలకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడంతో పాటు మరిన్ని ప్రైవేటు ఆసుపత్రులను కరోనా వైద్యం పరిధిలోకి తెస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 108 ప్రభుత్వ, 1032 ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సను అందిస్తున్నాయి. వాటిలో ఇపుడు 27,759 ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు అందుబాటులో ఉండగా 17,761 భర్తీ అయ్యాయి. అంటే దాదాపు 64 శాతం ఆక్యుపెన్సీ ఉంది.

ఆక్యూపెన్సీ

ఆక్సిజన్‌ కన్నా ఐసీయూలోనే...

బాధితులు చికిత్స కోసం ఆక్సిజన్‌, ఐసీయూల్లో చేరుతున్నా ఐసీయూలో చేరుతున్నవారి శాతం ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌ 24 నుంచి 30 వరకు పరిశీలిస్తే ఆక్సిజన్‌ పడకల్లో 15 శాతం ఆక్యుపెన్సీ పెరిగింది. అదే ఐసీయూలో అది 16.01 శాతంగా ఉంది. బాధితులు వైద్యం కోసం ఆసుపత్రుల్లో ఎక్కువగా చేరడంతో ఆ మేరకు అందుబాటులోని పడకలు తగ్గుతున్నాయి. వారం క్రితంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆక్సిజన్‌ పడకలు 500, ఐసీయూ పడకలు 276 తక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతానికి 694 ఐసీయూ పడకలు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'అవసరాల మేరకే ఆక్సిజన్​ వినియోగం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.