Government Action on Praja Palana Application MisUse : ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అధికారులు, సిబ్బందిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన దరఖాస్తులను డాటా ఎంట్రీకి తీసుకెళ్లే క్రమంలో పర్యవేక్షణ లోపించిన అధికారిపై కమిషనర్ వేటు వేశారు. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో వాల్యుయేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులపై మండిపడ్డారు.
దరఖాస్తులు నిర్లక్ష్యం అంశంలో జోనల్ అధికారులను రోనాల్డ్ రాస్ వివరణ కోరారు. హయతనగర్ సర్కిల్-3లో పన్ను వసూళ్ల విభాగానికి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మహేందర్‌ను బాధ్యుడిగా గుర్తించి సస్పెండ్ చేశారు. అలాగే కుత్బుల్లాపూర్‌లోనూ అభయహస్తం దరఖాస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనిపించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Praja Palana Application Neglet in Hyderabad : సోమవారం బాలానగర్‌లో రోడ్డుపై అభయహస్తం దరఖాస్తులు దర్శనం ఇచ్చాయి. బాలానగర్ ఫ్లైఓవర్‌పై ఓ ద్విచక్రవాహనంపై ప్రజాపాలన దరఖాస్తుల(Praja Palana Applications)ను ఓ వ్యక్తి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో అప్లికేషన్లు ఎగిరి కిందకి పడ్డాయి. దీంతో స్థానికులు వాటి చూసి షాక్ అయ్యారు. వెంటనే వారు ఆ వ్యక్తిని తనకి ఎక్కడవని ప్రశ్నించారు.
రోడ్డుపై ప్రత్యక్షమైన ప్రజా పాలన దరఖాస్తులు - కారణమిదే!
ఎవరో ర్యాపిడోలో బుక్ చేస్తే తాను తీసుకెళ్తుండగా ప్రజాపాలన దరఖాస్తులు కింద పడిపోయాయని వాహనదారుడు వివరించాడు. అతని దగ్గర సుమారు 500కు పైగా దరఖాస్తులు ఉన్నాయని స్థానికులు గుర్తించారు. పైగా అవి హయత్‌నగర్ సర్కిల్ పేరు రాసి ఉన్నాయని తెలుసుకున్నారు. దీంతో సంబంధం లేకుండా ఇంత దూరం ఎవరు తీసుకెళ్తున్నారని స్థానికులు అసహనానికి గురైయ్యారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపింది.
కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు - మరో మూడు పథకాల అమలుపై సర్కార్ కసరత్తు
Minister Ponnam Prabhakar Reaction on Praja Palana Neglect : ప్రజాపాలన దరఖాస్తులు అసలు బయటకి ఎలా వచ్చాయని ఎవరు ఈ పని చేశారని విస్తృతంగా పరిశోధించింది. దీంతో ఈ ఘటనకు నిర్లక్ష్యం వహించిన అధికారి హయత్‌నగర్ సర్కిల్-3 సూపరింటెండెంట్ అని గుర్తించింది. డాటా ఎంట్రీ(Praja Palana Programme Information Data Entry) కేంద్రానికి తరలిస్తుండగా రోడ్డుపై ఈ పత్రాలు పడ్డాయని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో సదురు అధికారిపై ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంది. వెంటనే హయత్‌నగర్ సర్కిల్-3 సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)సరైన వివరణ ఇవ్వాలని కోరారు.
ఐదు పథకాల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ, ఛైర్మన్‌గా భట్టి
-
I've been watching & hearing from concerned citizens about numerous videos of Praja Palana applications being mishandled carelessly by certain private individuals. These application forms contain sensitive data of Crores of Telangana citizens
— KTR (@KTRBRS) January 9, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
I urge the state government to take… pic.twitter.com/CPA5DJqwUr
">I've been watching & hearing from concerned citizens about numerous videos of Praja Palana applications being mishandled carelessly by certain private individuals. These application forms contain sensitive data of Crores of Telangana citizens
— KTR (@KTRBRS) January 9, 2024
I urge the state government to take… pic.twitter.com/CPA5DJqwUrI've been watching & hearing from concerned citizens about numerous videos of Praja Palana applications being mishandled carelessly by certain private individuals. These application forms contain sensitive data of Crores of Telangana citizens
— KTR (@KTRBRS) January 9, 2024
I urge the state government to take… pic.twitter.com/CPA5DJqwUr
KTR Reacts on Praja Palana Application MisUse : ప్రజాపాలన దరఖాస్తుల నిర్లక్ష్యం విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అజాగ్రత్తగా వ్యవహరించడంపై పలువురిలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. కోట్లాది ప్రజల సున్నితమైన వివరాలు ఉన్నాయని తెలిపారు. రహస్య సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకొని నివారించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ విజ్ఞాప్తి చేశారు. ఫించన్లు, గ్యారంటీలు ఇస్తామంటూ ఎవరైనా అడిగితే ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. మీరు బీఆర్ఎస్కు ఓటు వేసినా, వేయకపోయినా సరే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని సైబర్ క్రైం చట్టం తయారీలో భాగస్వామిగా చెబుతున్నానని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం : మంత్రి పొన్నం ప్రభాకర్