దేశంలో ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ కబాడీ లీగ్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మక క్రీడ అయిన ఇండియన్ ప్రీమియర్ హాండ్ బాల్ లీగ్. ఈ క్రీడకు తెలంగాణకు చెందిన అర్శన పల్లి జగన్ మోహన్ రావును గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్గా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియమించింది. ప్రస్థుతం హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న జగన్ మోహన్ రావుకు ఈ అత్యున్న గుర్తింపు దక్కినందున రాష్ట్ర క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జైపూర్లో పోటీలు..
తెలుగు రాష్ట్రాల్లో హ్యాండ్ బాల్ క్రీడకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్న జగన్ మోహన్ రావుకు మార్చి 5 నుంచి 25 వరకు జైపూర్లో జరిగే ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ ఇండియా పోటీలు నిర్వహించే బాధ్యతలు అప్పగించింది. ఇందులో తెలంగాణ టైగర్స్, దిల్లీ, చెన్నై, లక్నో, ముంబయి, బెంగళూరు రాష్ట్రాల టీంలు ఈ ప్రీమియర్ లీగ్లో పాల్గొననున్నాయి. జగన్ మోహన్ రావు నియామకంపై హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రామ సుబ్రమణి, జనరల్ సెక్రటరీ ఆనందేశ్వర్ పాండే అభినందించారు.
ఇవీ చూడండి: 'ఈటీవీ భారత్'ను సందర్శించిన యూఎస్ కాన్సుల్ జనరల్