హైటెక్ సిటీలోని ట్రెండెంట్ హోటల్లో సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో రైజ్ ఎబోవ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్కువగా కష్టపడితేనే గుర్తింపు వస్తుందని తమిళిసై వ్యాఖ్యానించారు. పురుషాధిక్యమున్న మన సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోవాలని సూచించారు. నారీమణులు తమలోని సానుకూలతలను ఆస్వాదించాలని తెలిపారు. అమెరికా కాన్సులేట్ జనరల్ జోయెల్ రిఫ్మెన్, అదనపు సీపీ శిఖా గోయల్, సినీ నటి మంచు లక్ష్మి తదితరులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: పత్రికల్లో వినోదాత్మక కథనాలే చదువుతున్నారా?