హైదరాబాద్ మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో 12 సంవత్సరాలకోసారి జరిగే కోటి కుంభాభిషేకం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.
గవర్నర్ రాకతో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళిసైతో పాటు భాజపా కె.లక్ష్మణ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనం వద్దని... సామాన్య భక్తులతో కలిసి దర్శంచుకొని తమిళిసై అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం