అంతర్జాతీయ బ్లడ్ ప్యూరిఫికేషన్ సొసైటీ(ఐఎస్బీపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 37వ అంతర్జాతీయ సదస్సుకు భాగ్యనగరం వేదికైంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను గవర్నర్‌గా కాకుండా.. ఓ వైద్యురాలిగా సదస్సుకు హాజరయ్యానని తమిళిసై పేర్కొన్నారు. పెరిటోనియల్ డయాలసిస్ వంటి అత్యాధునిక చికిత్సలు రక్త శుద్ధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. అలాంటి చికిత్సను పేదలకు అందించేందుకు దివంగత మహిళా నాయకులు సుష్మా స్వరాజ్, జయలలిత కృషి చేశారని కొనియాడారు. వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడు పలుమార్లు డయాలసిస్ అసిస్టెంట్‌గా పనిచేశానని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా వైద్యులు డయాలసిస్‌కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండిః ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు