త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గౌడ కులస్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాల్‌రాజ్ గౌడ్ రాజకీయ పార్టీలను కోరారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో గౌడ సంఘాల సమన్వయ కమిటీ సభ్యులు సమవేశమయ్యారు. జనాభా దమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని బాల్‌రాజ్‌గౌడ్ డిమాండ్ చేశారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు సీట్లు కేటాయించడంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తున్నా... గుర్తింపు దక్కట్లేదని చెప్పారు.
ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!