గ్రామాల్లో కల్లు గీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చినందుకు రాష్ట్ర గౌడ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి స్వామి గౌడ్ నాంపల్లి అబ్కారీ భవన్ ముందు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ల చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
లక్షలాది మంది గీతకార్మికులకు..
కల్లు గీసుకుని అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల లక్షలాది మంది గీతకార్మికులకు ఊరట లభించిందన్నారు. గత 50 రోజులుగా లాక్డౌన్ వల్ల పోలీసులు కల్లు అమ్ముకోకుండా ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గీతకార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. అలాగే మద్యం దుకాణాల మాదిరిగా.. కల్లు కంపౌండ్లను కూడా తెరిపించి తమను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ను విజ్ఞప్తి చేశారు. భౌతిక దూరం పాటిస్తూ గీతకార్మికులు కల్లు అమ్ముకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : అప్పుడు టీఎస్ ఐపాస్... ఇప్పుడు టీఎస్ బీపాస్