తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షునిగా కేశం నాగరాజు గౌడ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఓ హోటల్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాగరాజు గౌడ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా ఐలన్ గౌడ్, విక్రమ్ గౌడ్లను ఎన్నుకున్నారు. రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలిగా ధనుంజని గౌడ్ నియమితులయ్యారు.
విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో తమ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘం నూతన అధ్యక్షుడు కేశం నాగరాజు గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది గౌడ సామాజిక వర్గ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనాది కాలం నుంచి గౌడ కులం జీవనాధారమైన గీత వృత్తిని ఆధునీకరిస్తామన్నారు. ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గౌడ కుటుంబాల సమస్యలను ముఖ్యమంత్రిని కలిసి వివరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు.
ఇదీ చూడండి : ఈనెల 22 నుంచి బ్రాహ్మణ ఏకతా బస్సుయాత్ర