ETV Bharat / state

మజ్లిస్‌ అధినేతవి పరిణతి లేని వ్యాఖ్యలు : రాజాసింగ్​ - telangana news

పార్లమెంట్​లో మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. బారిస్టర్ చదివిన ఓవైసీకి ఏ మాత్రం పరిణతి లేదని విమర్శించారు. ప్రజల అభివృద్ధికి సంబంధించిన విషయాలపై మాట్లాడాలని కోరారు.

Goshamahal MLA Rajasing
'మజ్లిస్‌ అధినేతవి ఆలోచనా పరిణితి లేని వ్యాఖ్యలు'
author img

By

Published : Feb 14, 2021, 6:37 PM IST

బారిస్టర్ చదివిన మజ్లిస్​ అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీకి ఏ మాత్రం ఆలోచనా పరిణతి లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. పార్లమెంట్​లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ప్రజల అభివృద్ధికి సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టాలే తప్ప... ప్రజలను రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు.

ఏదో ఒక విధంగా టీవీలో కనిపించాలనే కోరికతో ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. హైదరాబాద్​, చెన్నై, బెంగళూరు, లాంటి నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసే ఉద్దేశం భాజపాకు లేదని ఆయన అన్నారు.

మజ్లిస్‌ అధినేతపై రాజాసింగ్ వ్యాఖ్యలు

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్​కు పుట్టినరోజు బహుమతి ఏమిటంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.