ETV Bharat / state

షోకాజ్​ నోటీసుకు సమాధానమిచ్చిన రాజాసింగ్​.. ఏమన్నారంటే..? - MLA Rajasingh latest news

MLA Rajasingh Reply to Showcause Notice: పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. షోకాజ్​ నోటీసు ఇచ్చిన భాజపా అధిష్ఠానానికి గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ సమాధానం ఇచ్చారు. పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు తానెప్పుడూ పాల్పడలేదని పేర్కొన్నారు. భాజపా కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి స్పష్టం చేశారు.

షోకాజ్​ నోటీసుకు సమాధానమిచ్చిన రాజాసింగ్​.. ఏమన్నారంటే..?

author img

By

Published : Oct 10, 2022, 9:02 PM IST

MLA Rajasingh Reply to Showcause Notice: భాజపా కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు తానెప్పుడూ పాల్పడలేదని పేర్కొన్నారు. భాజపా ఇచ్చిన షోకాజ్​ నోటీసుకు స్పందించిన రాజాసింగ్.. ఈ మేరకు జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు.

రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని గత ఆగస్టు 23న పార్టీ అధిష్ఠానం షోకాజ్​ నోటీస్​ జారీ చేసింది. రాజాసింగ్​ జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు అప్పట్లో ఆయన సతీమణీ గడువు కోరారు. ఈ క్రమంలోనే భాజపా షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ ఇవాళ సమాధానం ఇచ్చారు.

తానెప్పుడూ పార్టీ లైన్ దాటి ప్రవర్తించలేదని.. ప్రజలకు, హిందువులకు సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనపై ఎంఐఎం, తెరాసలు కుట్రపూరితంగా 100 కేసులు పెట్టాయని లేఖలో ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్‌ పరిధిలో ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోందని.. పాతబస్తీలో ఎంఐఎం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ హిందువులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. ఆ రెండు పార్టీల దురాగతాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.

మునావర్ ఫారూకీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే తాను ప్రస్తావించానని.. ఏ మతాన్నీ, ఇతర దేవుళ్లను కించపరచలేదని రాజాసింగ్​ స్పష్టం చేశారు. హిందువులను రెచ్చగొట్టేందుకే మునావర్ ఫారూకీ షోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారని రాజాసింగ్ ఆ లేఖలో వివరించారు.

ఇవీ చూడండి..

రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం

'జాతీయ జంతువుగా ఆవు' పిటిషన్​ తిరస్కరణ.. కొలీజియం నియామకాలకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.