ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో ప్రజాప్రతినిధులు బయటకు వస్తున్నారు. ఈ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దంటూ పలువురు వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
అనంతరం కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే.. అక్కడి వైద్య సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని.. కరోనా నివారణ చర్యల పట్ల మరింత అవగాహన కల్పించాలని వారికి సూచించారు.
ఇదీ చూడండి:- రోడ్డెక్కితే ముగ్గులో కూర్చోబెడతారు జాగ్రత్త!