ETV Bharat / state

కూల్చివేయమని చెప్పినా.. విద్యాశాఖ మంత్రి పట్టించుకోలేదు - mla raja singh visited sulthan bazar school

శిథిలావస్థలో ఉన్న సుల్తాన్​బజార్​ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూల్చివేసి, వేరే చోటుకు తరలించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం సమర్పించామని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయినా పట్టించుకోలేదని అందువల్లే పాఠశాల భవనం పైకప్పు, గోడలు కూలిపోయాయని ఆరోపించారు.

goshamahal mla raja singh visited sulthan bazar government school
విద్యాశాఖ మంత్రిపై రాజాసింగ్ విమర్శలు
author img

By

Published : Aug 27, 2020, 2:11 PM IST

హైదరాబాద్ సుల్తాన్ బజార్​లో కూలిపోయిన పురాతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షానికి.. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం పైకప్పు, గోడలు కూలిపోయాయని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చివేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించినా.. పట్టించుకోలేదని ఆరోపించారు.

కరోనా వల్ల పాఠశాల మూసి ఉందని, అందువల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని తెరిచి ఉంటే పెనుప్రమాదం సంభవించేదని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శిథిలావస్థకు చేరిన పాఠశాల, కళాశాల భవనాలను పూర్తిగా కూల్చివేసి వాటిని వేరే చోట్లకు తరలించాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.