ETV Bharat / state

గోవధపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు: రాజాసింగ్ - తెలంగాణ వార్తలు

హిందువునని చెబుతున్న సీఎం కేసీఆర్... గోవధపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. భోలక్​పూర్​లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. సీఎం స్పందించి ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేయాలని కోరారు.

goshamahal-mla-raja-singh-fire-on-cm-kcr-about-cows-slaughter-in-telangana-state
హిందువైన కేసీఆర్ గోవధపై ఎందుకు స్పందించడం లేదు: రాజాసింగ్
author img

By

Published : Jan 9, 2021, 10:30 AM IST

గోవులను చంపుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం భోలక్‌పూర్​లో రాత్రి రెండు వాహనాల్లో 24 ఆవులను అక్రమంగా గోవధశాలకు తరలిస్తుండగా బీబీనగర్‌ వద్ద గోసేవకులు, భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా గోరక్షణ కోసం ప్రత్యేకమైన టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం చట్టంలో పేర్కొన్న విధంగానైనా ఆవులను రక్షించాలని కోరారు.

ఇదీ చదవండి: కాసేపట్లో జంట నగరాల్లో మంత్రి కేటీఆర్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.