ETV Bharat / state

'గోవులను వధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు' - పట్టించుకోవడం లేదు

బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను వేలాదిగా వధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని తెలంగాణ గోశాల సమాఖ్య ఆరోపించింది.

'గోవులను వధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'
author img

By

Published : Jul 31, 2019, 6:51 PM IST

ఆగస్టు 12న జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను వేలాదిగా వధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని తెలంగాణ గోశాల సమాఖ్య ఆరోపించింది. జీహెచ్ఎంసీ 540 చట్టం ప్రకారం నగరానికి పశువులను తీసుకురావడానికి అనుమతి లేదని సమాఖ్య అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ తెలిపారు.

ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం బక్రీద్ పండుగ 15 రోజుల ముందు నుంచే నగర సరిహద్దుల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసేదని, కానీ ఈ సంవత్సరం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే పాతబస్తీలో ఉన్న మదర్సాలలో వేల పశువులను అక్రమంగా తీసుకొచ్చారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికే వత్తాసు పలుకుతూ వ్యవహరించడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జంతు సంరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, లేని పక్షంలో చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

'గోవులను వధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'

ఇదీ చూడండి : కాఫీ కింగ్ సిద్ధార్థ ప్రయాణం.. ఆస్వాదించే కొద్దీ మధురం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.