ETV Bharat / state

గవర్నర్‌ నరసింహన్‌కు శనివారం వీడ్కోలు - రేపు వీడ్కోలు

తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలకనుంది. దాదాపు తొమ్మిదిన్నరేళ్లు సేవలందించినందుకుగాను సత్కరించనున్నారు.

గవర్నర్‌ నరసింహన్‌కు రేపు వీడ్కోలు
author img

By

Published : Sep 6, 2019, 7:08 AM IST

Updated : Sep 6, 2019, 10:59 AM IST

గవర్నర్‌ నరసింహన్‌కు శనివారం వీడ్కోలు

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు చెప్పనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో ఉదయం 11 గంటలకు ఈ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అదే రోజు నరసింహన్‌ బాధ్యతల నుంచి వైదొలిగి రాత్రి 7 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 6 గంటలకు విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు పలకనుంది.

గురువారం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు గవర్నర్‌ నరసింహన్‌ దంపతులతో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ సేవలను పోచారం ప్రశంసించారు. కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య గవర్నర్‌ను కలిసి తాను రూపొందించిన ఆయన చిత్రాన్ని అందజేశారు. తెదేపా తెలంగాణ నాయకులు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.

రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు రాజ్‌భవన్‌కు రానున్నారు. మధ్యాహ్నం 11 గంటలకు ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ప్రమాణం చేయిస్తారు.

ఇదీ చూడండి : దోమల నివారణే.. జ్వరానికి మందు..!

Intro:TG_KRN_08_05_MANTRI EETELA_MANDULA PAMPINI_AB_TS10036
sudhakar contributer karimnagar

జిల్లాలో ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధిని అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు కరీంనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆర్ సీ లిక్ ఆల్బ హోమియోపతి మందులను విద్యార్థులకు అందించారు మూడురోజులపాటు ఉదయము పరగడుపున ఆరు మాత్రలు వేసుకుంటే డెంగ్యూ చికెన్ గునియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని డాక్టర్ సందీప్తి తెలిపారు ఉదయము పరగడుపున వేయాల్సిన మాత్రలను మంత్రి ఈటెల రాజేందర్ విద్యార్థులకు పగటిపూట వేయడం విశేషం

బైట్ సందీప్తి వైద్యురాలు

Body:య్

Conclusion:య్
Last Updated : Sep 6, 2019, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.