జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు శుభవార్త. గత విద్యాసంవత్సరంలో పనిచేసిన వారినే కొనసాగించాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 404 ప్రభుత్వ కళాశాలల్లో 1354 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం కొత్త వారిని నియమించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 34 మంది అతిథి అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటి వరకు పనిచేసిన వారినే కొనసాగించాలని కొత్త నియామక ప్రక్రియ చేపట్టవద్దని ఇంటర్‌బోర్డును ఆదేశించింది.
ఇదీ చూడండి: అధికారుల అలసత్వమా... విద్యార్థులంటే నిర్లక్ష్యమా?