ETV Bharat / state

భాగ్యనగరంలో మరో ప్రపంచ దిగ్గజ సంస్థ కార్యాలయం ఏర్పాటు

పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు.. హైదరాబాద్‌కు తరలివస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌, గూగుల్‌ వంటి సంస్థలు కార్యకలాపాలను మొదలుపెట్టగా.. అమెరికాకు చెందిన దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ తన కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించింది. దేశంలో రెండో అతిపెద్దకార్యాలయం ఏర్పాటు చేస్తామన్న గోల్డ్‌మ్యాన్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్‌... ప్రభుత్వం తరఫున అన్నిరకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

భాగ్యనగరంలో మరో ప్రపంచ దిగ్గజ సంస్థ కార్యాలయం ఏర్పాటు
భాగ్యనగరంలో మరో ప్రపంచ దిగ్గజ సంస్థ కార్యాలయం ఏర్పాటు
author img

By

Published : Oct 2, 2020, 5:25 AM IST

భాగ్యనగరంలో మరో ప్రపంచ దిగ్గజ సంస్థ కార్యాలయం ఏర్పాటు

అమెరికాకు చెందిన దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ గ్రూప్‌ దేశంలోని తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని.... హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో 500 మంది నిపుణులను నియమించి... వచ్చే ఏడాది ద్వితీయార్థం నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​కు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత... హైదరాబాద్‌లో మానవ వనరులు, వాణిజ్య స్థిరాస్తులు, ఉద్యోగులకు గృహాల లభ్యత, నాణ్యమైన మౌలికవసతులను పరిగణలోకి తీసుకొని ఆ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో.. గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ సంస్థ భారత విభాగం ఛైర్మన్‌ సంజయ్‌ ఛటర్జీ, ఎండీ గుంజన్‌సంతాని, సీఆవో రవికృష్ణన్‌ దృశ్యమాధ్యమంలో భేటీ అయ్యారు.

హైదరాబాద్‌ అన్నిరకాలుగా అనువైనది

ఈ సందర్భంగా విస్తరణ ప్రణాళికను వివరించారు. 1869లో అమెరికాలోని న్యూయార్స్‌లో ఏర్పాటైన ఆ సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌, పెట్టుబడుల నిర్వహణ, సెక్యూరిటీలు, ఉమ్మడి భాగస్వామ్యాలు వంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సంస్థ వార్షిక ఆదాయం 2.74 లక్షల కోట్లుండగా 16 దేశాల్లో విస్తరించి ఉన్న... తమ సంస్థలో 6 వేల మంది పనిచేస్తున్నారని పేర్కొంది. 2004లో బెంగళూరులో కార్యాలయం ప్రారంభించామని.... తమ కార్యకలాపాలు విస్తరించేందుకు హైదరాబాద్‌ అన్నిరకాలుగా అనువైనదిగా గుర్తించినట్లు వారు వెల్లడించారు. తద్వారా ప్రపంచస్థాయిప్రమాణాలతో కొత్త ప్రతిభను ప్రోత్సహించండంతోపాటు.. ప్రపంచస్థాయి పోటీకి అనుగుణంగా వ్యాపారాల పెంపుదలకు ప్రయత్నిస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. తమ సంస్థ భవిష్యత్‌ వృద్ధికి భాగ్యనగరాన్ని సరైన వేదికగా భావిస్తున్నామని తెలిపారు.

కేటీఆర్‌ హర్షం

గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని.. ఆ సంస్థకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ హైదరాబాద్‌ను కొత్త కేంద్రంగా ఎంచుకోవడం ఆనందంగా ఉందన్న కేటీఆర్‌.. కరోనా మహమ్మారి సమయంలోనూ భాగ్యనగరం ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆకర్షిస్తోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నగరంలోని స్థితిగతులు.. పోటీ వాతావరణం.. ఎంతోయోగ్యంగా ఉండటమే అందుకు కారణమని వివరించారు. భాగ్యనగరంలో ఇప్పటికే అత్యుత్తమ ఆర్థికసాంకేతిక పర్యావరణ వ్యవస్థ ఉందన్న ఆయన.. గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ రాకతో అది మరింత బలోపేతం అవుతుందని వివరించారు.

ఇదీ చదవండి: నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న చీరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.