ETV Bharat / state

పండుగల వేళ.. పసిడి అమ్మకం వెలవెల - gold buying during Dhanatrayodhasi

వేడుకలు ఏవైనా పసిడి కొనుగోలు భారతీయులకు ఆనవాయితీ. అందులోనూ ధనత్రయోదశికి బంగారం భారీగా కొనుగోలు చేస్తారు. కానీ ధరలు పెరిగినందున... గతేడాది అమ్మకాల్లో 50 శాతం ఉన్నా సంతోషమేనంటున్నారు వ్యాపారులు.

పండుగల వేళ.. పసిడి అమ్మకం వెలవెల
author img

By

Published : Oct 25, 2019, 5:27 AM IST

Updated : Oct 25, 2019, 7:18 AM IST

ఈ ఏడాది ధనత్రయోదశి, దీపావళి పండగలు నగల వ్యాపారులకు కలిసొచ్చేలా లేవు. ప్రజలు కొనుగోలు చేసే తీరు కూడా మారింది. పండగ సమయాల్లో ప్రజలు కొనుగోలు చేయటం తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. గతేడాది ఈ సమయంలో పది గ్రాముల పసిడి విలువ రూ.32వేలు పలికింది. కానీ ప్రస్తుతం దాదాపు 25 శాతం మేర పెరిగి రూ. 40 వేలకు చేరువైంది. ఈ ఏడాది 15 శాతం అమ్మకాలు తగ్గినట్లు విక్రేతలు చెబుతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాలను 2.5శాతం పెంచింది. ఇవి చాలవన్నట్టు వాణిజ్య యుద్ధం వల్ల ధరలు భారీగా పెరిగాయి. దీపావళి నాటికి పసడి ధర మరింత తగ్గితే తప్ప కొనుగోళ్లు పెరిగే అవకాశం లేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: పసిడికి పండుగ డిమాండ్​.. 10 గ్రాముల ధరెంతంటే...?

TG_HYD_54_24_GOLD_BUYING_DURING_DHANATRAYODHASI_PKG_7202041 () రేపటి దన త్రయోదశి సందర్భంగా ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ సారి ఎక్కువ ధరల ఉండటంతో పాటు వివిధ కారణాల వల్ల ఈ పండగ విక్రయాలపై ఆశాజనకంగా లేమని వ్యాపారులు అంటున్నారు. గత సంవత్సరం జరిగిన విక్రయాల్లో 50 నమోదైనా సంతోషిస్తామని వారు చెబుతున్నారు. Look … వాయిస్ : ప్రజలు కొనుగోలు చేసే తీరు కూడా మారింది. పండగ సమయాల్లో ప్రజలు కొనుగోలు చేయటం తగ్గిపోయిందనివ్యాపారులు చెబుతున్నారు. వారి వద్ద డబ్బులున్నప్పుడో లేక… బంగారం ధర తక్కువున్నప్పుడో.. పెళ్లి లాంటి సందర్భాల్లో కొనుగోళ్లు చేస్తున్నారని వారు అంటున్నారు. బైట్ : సతీష్ అగర్వాల్, నగల వ్యాపారి. వాయిస్ : గత సంవత్సరం ఈ సమయంలో బంగారం పది గ్రాముల ధల రూ.32వేలు ఉండేది. ఈ సారి దానికంటే దాదాపు 25 శాతం ఎక్కువగా రూ.40వేల వద్ద ఉంది. కొన్ని నెలల క్రితం బంగారంపై కస్టమ్స్ సుంకాలను కేంద్రం 2.5 శాతం కస్టమ్స్ ని పెంచింది. దీనితో పాటు వాణిజ్య యుద్ధం వల్ల ఇటీవల ధరల పెరిగాయి. బైట్ : సతీష్ అగర్వాల్, నగల వ్యాపారి. వాయిస్ : మొత్తం మీద వినియోగదారులు సెంటిమెంటు బాలేదని వ్యాపారులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రితం సారి ఇదే సమయంతో పోల్చితే స్పర్ణం అమ్మకాలు 15 శాతం పడిపోయాయని విక్రయదారులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం పరిస్థితి నుంచి బయటకి వచ్చి బంగారం ధర తగ్గినట్లయితి బంగారం కొనుగోళ్లు మారుతాయని వారు అంటున్నారు. బైట్ : సతీష్ అగర్వాల్, నగర వ్యాపారి.
Last Updated : Oct 25, 2019, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.