ETV Bharat / state

గోదావరి-కావేరీ అనుసంధానంపై వచ్చే నెలలో మరోసారి చర్చ - NWDA Meeting in next month

NWDA Meeting: గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై వచ్చే నెల 15న జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) మరోసారి చర్చించనుంది. ఆ సంస్థ 70వ సర్వసభ్య సమావేశం దిల్లీలో జరగనుంది. భాగస్వామ్య రాష్ట్రాలతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తుండగా.. ఎజెండాలో కీలకాంశంగా గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టు ఉంది.

గోదావరి-కావేరీ అనుసంధానంపై వచ్చే నెలలో మరోసారి చర్చ

author img

By

Published : Oct 26, 2022, 7:53 AM IST

NWDA Meeting: గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై వచ్చే నెల 15న మరోమారు జాతీయ స్థాయిలో చర్చ జరగనుంది. నవంబర్ 15న దిల్లీలో జరగనున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్​డబ్ల్యూడీఏ) 70వ గవర్నింగ్ బాడీ సమావేశం ఇందుకు వేదిక కానుంది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఎన్​డబ్ల్యూడీఏ అధికారులతో పాటు అన్ని రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు, ఈఎన్సీలు పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన ప్రణాళికలు, వాటి పురోగతిని సమావేశంలో చర్చిస్తారు.

గోదావరి-కావేరీ అనుసంధానానికి సంబంధించి ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యామ్నాయ ప్రతిపాదన ప్రస్తావనకు రానుంది. గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జల సంఘం తేల్చిన నేపథ్యంలో తన వాటాలో ఛత్తీస్​గఢ్​ వినియోగించుకోని నీటిని మాత్రమే కావేరీకి ఇచ్చంపల్లి నుంచి మళ్లిస్తామని జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై భాగస్వామ్య రాష్ట్రాలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. దీంతో వచ్చే నెలలో జరగనున్న గవర్నింగ్ బాడీ సమావేశంలో మరోమారు చర్చించనున్నారు.

ఇవీ చూడండి..

నదుల అనుసంధానానికి తెలంగాణ ససేమిరా.. 'నీటి లభ్యత తేల్చాకే ముందుకు నడవాలి'

మునుగోడులో ప్రలోభాల పర్వాన్ని అడ్డుకునేందుకు కొత్త కార్యక్రమానికి ఈసీ శ్రీకారం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.