ETV Bharat / state

'ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాలి'

author img

By

Published : Jun 5, 2020, 7:18 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. డీపీఆర్​లు అందితే గానీ ప్రాజెక్టులు కొత్తవా, పాతవా అనేది తేల్చలేమని అభిప్రాయపడింది. పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలపగా... అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం ఎజెండా ఇవ్వాలని బోర్డు సూచించింది. టెలిమెట్రీ కేంద్రాల ఖరారు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Hyderabad latest news
Hyderabad latest news

ఈ నెల 10 వరకు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని ఉభయ తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. హైదరాబాద్ జలసౌధలో గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన తొమ్మిదో సమావేశం జరిగింది. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్​లకు సంబంధించిన అంశంపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​లు ఇవ్వాలని పదేపదే కోరుతున్నామన్ని బోర్డు పేర్కొంది. తెలంగాణ చేపట్టిన కొన్ని ప్రాజెక్టులపై ఇటీవల ఏపీ ఫిర్యాదు చేసిందని తెలిపింది.

కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం...

తాము కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదని తెలంగాణ అధికారులు బోర్డుకు తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కేటాయింపులు చేసి మంజూరు చేసిన ప్రాజెక్టులనే... తమ అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి చేపట్టినట్లు వివరించారు. తెలంగాణకు 967 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపు ఉందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని... కేటాయింపులకు లోబడే తాము ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు ఇతర ప్రాజెక్టుల స్వరూపంలో మార్పులు ఉన్నాయన్న ఆంధ్రప్రదేశ్... ప్రాజెక్టుల సామర్థ్యాన్ని కూడా పెంచారని పేర్కొంది.

టెలిమెట్రీ కేంద్రాల కోసం ప్రత్యేక కమిటీ ....

ఖమ్మం జిల్లాలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అంతర్ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ కేంద్రాలను ఖరారు చేసేందుకు బోర్డు సభ్యుని నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం ఎజెండా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించిందని గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు. అలాగే గతంలో ఇచ్చిన డీపీఆర్​లకు అనుబంధాలను ఇచ్చేందుకు ఏపీ సమ్మతి తెలిపిందని ఆయన​ పేర్కొన్నారు. ప్రాజెక్టుల డీపీఆర్​లు తమకు అందితే గానీ అవి పాతవో, కొత్తవో చెప్పడం సాధ్యం కాదని బోర్డు ఛైర్మన్​ చెప్పారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.