ETV Bharat / state

Godavari-Krishna: మెరుగ్గా ఉన్నా ప్రవాహం లేదు.. వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ - గోదావరిలో మెరుగ్గా నీటి జలాలు

గోదావరి బేసిన్‌లో ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో గత ఏడాది కంటే నీటి నిల్వలు మెరుగ్గా ఉండగా.. కృష్ణా బేసిన్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరోవైపు కృష్ణా నదిలోకి ఎగువ నుంచి వస్తున్న నీటి కంటే సముద్రంలోకి వెళ్తున్నది ఎక్కువగా ఉంది. గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లలో నిల్వలు మెరుగ్గా ఉన్నా నదిలో ఇంకా ప్రవాహం మాత్రం పెరగలేదు.

Godavari-Krishna
గోదావరి-కృష్ణా జలాలు
author img

By

Published : Jul 9, 2021, 7:53 AM IST

అన్ని ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొంటే గోదావరి(Godavari)లో మరో 100 టీఎంసీల నిల్వకు మాత్రమే ఖాళీ ఉండగా... కృష్ణా (Krishna)లో 400 టీఎంసీల నిల్వకు అవకాశం ఉంది. గోదావరిలో నది నుంచి ఎత్తిపోసుకొని వినియోగించుకొనే భారీ పథకాలు ఉండగా, కృష్ణాలో రిజర్వాయర్లలో నిల్వ చేసుకొని వాడుకొనేది ఎక్కువనే విషయం తెలిసిందే.

గోదావరిలో నిల్వలు బాగానే ఉన్నా..

గోదావరి బేసిన్‌ (Godavari Basin)లోని రిజర్వాయర్లలో నిల్వలు మెరుగ్గా ఉన్నా నదిలో ఇంకా ప్రవాహం పెరగలేదు. శ్రీరాంసాగర్‌, సింగూరు, నిజాంసాగర్‌, కడెం, ఎల్లంపల్లి, మధ్య మానేరు, దిగువ మానేరు ఇలా అన్ని ప్రాజెక్టుల్లోనూ గత ఏడాది కంటే నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీరాంసాగర్‌ నిండటానికి ఇంకా 60 టీఎంసీలు అవసరం కాగా, సింగూరు, నిజాంసాగర్‌లు నిండటానికి 23 టీఎంసీలు.. మొత్తంగా గోదావరిపై అన్ని ప్రాజెక్టులు నిండటానికి వంద టీఎంసీలు అవసరం. ఈ నదిలో సాధారణంగా జులైలోనే ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా నామమాత్రంగానే ఉంది. దిగువన ధవళేశ్వరం వద్ద 13,700 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, ఈ నీటిని డెల్టా కాలువలకు విడుదల చేశారు. ఈ సంవత్సరం జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు కృష్ణాలో ప్రకాశం బ్యారేజి నుంచి 4 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లగా, గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లింది 0.27 టీఎంసీ మాత్రమే.

అక్కడ నిండితే కానీ..

గురువారం ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలంలోకి 2,660 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజి వద్ద 7,436 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. జూన్‌, జులై నెలల్లో కృష్ణాలోకి వచ్చే ప్రవాహాన్ని ఎగువన ఆలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లలో కర్ణాటక నిల్వ చేస్తుంది. ఆ రెండు నిండి ఎక్కువ ప్రవాహం వస్తే కానీ దిగువకు వదలడం లేదు. గత కొన్నేళ్లుగా శ్రీశైలం నిండటం లేదు. అయితే గత ఏడాది జులైలోనూ వంద టీఎంసీలు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా ఆలమట్టిలోకి ప్రవాహం పెరిగితే ఈ నెలలోనే ఆమేరకు వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, గురువారం ఉదయానికి 812.5 అడుగుల వద్ద 35 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఈ జలాశయం నిండడానికి ఇంకా 180 టీఎంసీలు అవసరం.

కృష్ణా జలాలు

ప్రస్తుతం శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా 14,650 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌లోకి వదులుతున్నారు. శ్రీశైలానికి జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 26 టీఎంసీలు రాగా, 25.8 టీఎంసీలను సాగర్‌కు వదిలారు. నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా 30 వేల క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలో విద్యుదుత్పత్తి చేసి 8,600 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజికి వదులుతున్నారు. బ్యారేజి నుంచి కేవలం 1360 క్యూసెక్కులను డెల్టా కాలువలకు వదిలి, మిగిలిన నీటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సముద్రంలోకి విడుదల చేసింది. కృష్ణాలో ఎగువన ఉన్న ఆలమట్టిలోకి కేవలం 4 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, తుంగభద్రలోనూ అంతే ప్రవాహం ఉంది. ఈ రెండూ నిండితే కానీ శ్రీశైలంలో నీటినిల్వ పెరగదు.

ఇదీ చూడండి: కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.