ETV Bharat / state

GO 46 Controversy Telangana : TSSP నియామకాల్లో మంటలు రేపుతున్న జీవో 46

GO 46 Controversy Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ టీఎస్​ఎస్పీ నియామక ప్రక్రియలో జీవో నంబరు 46 మంటలు రేపుతోంది. అందులోని కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌ కేడర్‌ అంశంపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ జిల్లాల జనాభాను ప్రాతిపదికగా చేసుకుని టీఎస్​ఎస్పీ పోస్టులను కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కటాఫ్‌ మార్కుల్లో వ్యత్యాసం కారణంగా రాజధాని ప్రాంతానికే ఎక్కువ ఉద్యోగాలు దక్కుతాయని చెబుతున్నారు.

GO 46 Controversy
GO 46 Controversy of TSSP
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 7:53 AM IST

GO 46 Controversy Telangana TSSP నియామకాల్లో మంటలు రేపుతున్న జీవో 46

GO 46 Controversy Telangana : రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి జీవో నంబర్‌ 46 వివాదం రాజేస్తోంది. జీవోలోని కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌ కేడర్‌ అంశంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇది 9 శాఖలకు సంబంధించినదైనా.. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఉద్యోగాల భర్తీ చుట్టే కేంద్రీకృతమైంది. రెవెన్యూ జిల్లాల జనాభాను ప్రాతిపదికగా చేసుకొని టీఎస్​ఎస్పీ పోస్టుల్ని కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందనేది వారి ప్రధాన ఆందోళన.

Telangana GO 46 Controversy : కటాఫ్‌ మార్కుల్లో వ్యత్యాసం కారణంగా రాజధాని ప్రాంతానికే ఎక్కువ ఉద్యోగాలు దక్కుతాయని చెబుతున్నారు. టీఎస్​ఎస్పీ పోస్టులు రాష్ట్రస్థాయివి కావడంతో కటాఫ్‌ మార్కులను సైతం రాష్ట్రస్థాయిలోనే పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీఎస్​ఎస్పీ నియామకాల్లో జీవో నంబరు 46ను మినహాయించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

TSSP Constable GO 46 Issue : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి- టీఎస్​ఎల్పీఆర్బీ నియామక ప్రక్రియలో భాగంగా త్వరలో (TSPSC Notifications 2023)టీఎస్​ఎస్పీకి సంబంధించి 5వేల 10 పోస్టుల తుది ఫలితాలను వెల్లడించబోతున్నారు. అయితే కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల భర్తీ జరగాలన్న రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా తెరపైకి వచ్చిన సీడీసీ అంశం తాజా వివాదానికి కేంద్రమైంది. టీఎస్​ఎస్పీ బెటాలియన్లు అన్ని జిల్లాల్లో లేని కారణంగా పొరుగునే ఉన్న మూడు, నాలుగు జిల్లాలను కలిపి సీడీసీ క్యాడర్‌ను నిర్ణయించారు. ఈ ప్రాతిపదికన పోస్టుల్ని కేటాయించేందుకు ప్రభుత్వం జీవో నంబరు 46ను జారీ చేసింది. దీని ప్రకారం రెవెన్యూ జిల్లాలవారీగా జనాభాను పరిగణనలోకి తీసుకుని పోస్టులను భర్తీ చేయనుండటం వివాదాన్ని రాజేస్తోంది.

GO 46 issue in Telangana : జీవో46పై అభ్యర్థుల ఆందోళనలు.. రద్దు చేయాలని డిమాండ్

ఆ జిల్లాల వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కవ : తాజా జనాభా లెక్కలు అందుబాటులో లేకపోవడంతో 2011 జనగణనే ఆధారంగా చేసుకుని పోస్టుల్ని భర్తీ చేసే యోచనతో ఉన్నారు. జనాభా ప్రాతిపదికన పోస్టులను కేటాయిస్తే గ్రామీణ జిల్లాలకు తక్కువ పోస్టులు వస్తాయి. దాంతో అక్కడ కటాఫ్‌ మార్కులు ఎక్కువగా ఉండే అవకాశముంది. ఫలితంగా ఎక్కువ మార్కులు (TSSP Cutoff) సాధించినా ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోతారనేది వారి ప్రధాన అభ్యంతరం. అదే సమయంలో ఎక్కువ జనాభా ఉండే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఎక్కువ పోస్టులుండటంతో అక్కడి అభ్యర్థులు తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం పొందే అవకాశం ఉండటంతో తమకు అన్యాయం జరుగుతుందనేది గ్రామీణ అభ్యర్థుల వాదన.

మిగిలిన రాష్ట్రస్థాయి పోస్టులైన ఎస్సార్​సీపీఎస్​, ఎస్పీఎఫ్​ పోస్టులకు వర్తించని జీవో నంబరు 46 టీఎస్​ఎస్పీ పోస్టులకు ఎందుకు వర్తింపజేస్తున్నారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టీఎస్​ఎస్పీ రాష్ట్రస్థాయి పోస్టు అయినప్పుడు రాష్ట్రస్థాయిలోనే కటాఫ్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాలవారీగా ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నారు. 2015, 2018 నోటిఫికేషన్లలో టీఎస్​ఎస్పీ పోస్టుల భర్తీకి రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నారని గుర్తుచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సివిల్, ఏఆర్​ పోస్టులు సైతం తక్కువగా ఉండటంతో అక్కడి అభ్యర్థులకు అత్యధిక మార్కులు సాధించినా ఉద్యోగం పొందటం కష్టమవుతుందని వాదిస్తున్నారు. సీజీలీతో రాష్ట్రస్థాయి పోస్టుగా ఉండే టీఎస్​ఎస్పీలోనూ అవకాశం లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు.

Telangana TeT Notification 2023 : టెట్‌ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు

Telangana DSC Notification 2023 : 'రెండ్రోజుల్లో.. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.