ETV Bharat / state

విశాఖకు తుపాన్ల ముప్పు.. జీఎన్​ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు - జీఎన్​ రావు బోస్టన్ కమిటీ నివేదికలు న్యూస్

ఏపీ రాజధాని అమరావతికి వరద ముప్పు ఉందంటూ నివేదికలో తెలిపిన జీఎన్​ రావు, బోస్టన్‌ కమిటీలు... విశాఖకు తుపాన్ల ముప్పు ఉందని హెచ్చరించాయి. కాలుష్యం, భద్రతా సమస్యలూ ఉన్నాయని... ప్రభుత్వ భూముల లభ్యతా తక్కువేనని తేల్చిచెప్పాయి.

gn rao committe warn to govt about vishaka cyclones news
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-January-2020/5878110_34_5878110_1580248936045.png
author img

By

Published : Jan 29, 2020, 8:13 AM IST

విశాఖకు తుపాన్ల ముప్పు.. జీఎన్​ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు

ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు ఉన్న సానుకూలతలను చెబుతూనే అక్కడున్న ప్రతికూలతలనూ విశ్రాంత ఐఏఎస్​ అధికారి జీఎన్​ రావు నేతృత్వంలోని నిపుణల కమిటీ, బోస్టన్‌ కమిటీలు ప్రస్తావించాయి. తీరప్రాంత నగరానికి తుపానుల ముప్పు ఉందని హెచ్చరించాయి. సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌, శాసనసభలను విశాఖలో ఏర్పాటు చేయాలని సిఫారసు చేస్తూనే... ముఖ్యమైన కార్యాలయాలను సముద్ర తీరానికి వీలైనంత దూరంలో ఏర్పాటు చేయాలని జీఎన్​ రావు కమిటీ సూచించింది. నీటి కాలుష్య సమస్యను ప్రస్తావించింది. తగినంత ప్రభుత్వ భూమి లేదని, భోగాపురం ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతంలో.. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని పేర్కొంది.

జీఎన్‌ రావు కమిటీ నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలు..

  • విశాఖకు తుపాన్ల ముప్పుతో పాటు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ (సీఆర్‌జెడ్‌) పరిమితులు, తీరం కోతకు గురవడం వంటి సమస్యలున్నాయి.
  • సముద్ర జలాలు చొచ్చుకువచ్చి భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారడం ఆందోళనకరం.
  • పోర్టు ప్రాంతంలో చాలాచోట్ల చమురు లీకవుతోంది.
  • ఉక్కు కర్మాగారం, పోర్టు సంబంధిత కార్యకలాపాలవల్ల పారిశ్రామిక కాలుష్య సమస్యలున్నాయి.
  • ఈ ప్రాంతంలో తూర్పు నౌకాదళ కేంద్రం ఉండటం, అణు జలాంతర్గాములకు ఇది కేంద్రం కావడం వల్ల భద్రతాపరమైన సమస్యలూ ఉన్నాయి.
  • విశాఖ నగరం, చుట్టుపక్కల ప్రభుత్వ భూముల లభ్యత తక్కువే.
  • ఇప్పటికే చాలా సంస్థలు భూ కేటాయింపునకు నిరీక్షిస్తున్నాయి.
  • ఈ పరిమితుల దృష్ట్యా ఇక్కడి నుంచి కొత్తగా పరిపాలన కార్యక్రమాలు ప్రారంభించడం అవాంఛనీయం.
  • జోన్‌-1లో ఆర్థిక పురోభివృద్ధికి ప్రతిపాదిత భావనపాడు పోర్టు, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కీలకం. అయితే అవసరం/ఆవశ్యకత, పర్యావరణం దృష్టి కోణంలో వాటిని పునఃసమీక్షించాలి. ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతానికి తుపానులు, ఉప్పెన ప్రమాదం పొంచి ఉంది.
  • భోగాపురంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం, సంబంధిత కార్యకలాపాలనూ పునఃసమీక్షించాలి.
  • 2041 నాటికి విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ కోసం రూపొందిస్తున్న బృహత్‌ ప్రణాళికలో పైన పేర్కొన్న అంశాలను విస్మరించినట్టు కనిపిస్తోంది.
  • జోన్‌-1లోకి వచ్చే విశాఖలో భారీ పరిశ్రమలు, పోర్టులు ఉన్నందున గాలి నాణ్యత క్షీణిస్తోంది.

తుపానులతో ఆర్థిక వ్యవస్థ కుదేలు

  • రాష్ట్రంలోని తీర ప్రాంతానికి తుపానులు, పెనుగాలులు, ఉప్పెనలతో ప్రమాదం పొంచి ఉంది. గడిచిన దశాబ్దంలో ఏపీ తీరాన్ని తాకిన తుపానుల సంఖ్య, తీవ్రత బాగా పెరిగింది. వాతావరణ మార్పుల వల్ల ఈ ప్రమాదం భవిష్యత్తులో మరింత పెరుగుతుంది. ప్రతి రెండేళ్లలో ఒక తీవ్ర తుపాను ఏపీని తాకడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.
  • నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి తీవ్ర తుపాన్లు, ఉప్పెనల ప్రమాదం ఉంది. వీటన్నింటిలో విశాఖ పరిస్థితి కాస్త మెరుగు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, తీరప్రాంత స్వభావం వల్ల మిగతా వాటితో పోలిస్తే విశాఖకు కొంచెం రక్షణ ఎక్కువ ఉంది.
  • ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో పెను తుపానులు సంభవిస్తే మౌలిక వసతులు, భవనాలకు నష్టం అపారంగా ఉంటుంది. ఎక్కువ ప్రాణనష్టమూ సంభవిస్తుంది.
  • హుద్‌హుద్‌, తిత్లి వంటి తుపానుల వల్ల జరిగిన నష్టాన్ని విశ్లేషించాలి. భవిష్యత్తులో ఇలాంటి తుపానులు వచ్చినప్పుడు జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు, అర్థం చేసుకునేందుకు ఈ సమాచారం తోడ్పడుతుంది.

ప్రభుత్వ భవనాల సముదాయం అభివృద్ధికి ప్రతిపాదనలు

అమరావతిలోని ప్రభుత్వ భవనాల సముదాయ ప్రాంతాన్ని తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయడానికి జీఎన్‌రావు కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. మొత్తం 1,575 ఎకరాలలో భారీ స్థాయిలో భవనాలు, ల్యాండ్‌స్కేప్‌లను గతంలో ప్రతిపాదించారని.. ఇది భారీ వ్యయంతో కూడుకున్నదని అభిప్రాయపడింది. ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు అనుసరణీయ పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నామని పేర్కొంది. రాజధాని వికేంద్రీకరణ విధానం నేపథ్యంలో ప్రభుత్వ భవనాల సముదాయం (ఏజీసీ) ప్రాంతంలో ఆడంబరాలు, భారీ భవనాలు అవసరం లేదని సూచించింది.

ప్రతిపాదనలివే..

  1. కృష్ణా నదిని ఆనుకుని ఉన్న పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టకూడదు. సీడ్‌యాక్సిస్‌ రోడ్డుకు దక్షిణం వైపు అభివృద్ధి చేపట్టాలి.
  2. ఇప్పటికే నిర్మించిన జీప్లస్‌ 12 అపార్టుమెంట్లను మినహాయించేసి గృహ అవసరాలను కొత్తగా మదింపు చేయాలి. గృహాల పరిమాణాన్ని తగ్గించాలి.
  3. హైకోర్టు నిర్మాణ వ్యయాన్ని బాగా తగ్గించేందుకు వీలుగా భవన ఆకృతిని పునఃపరిశీలించాలి.
  4. మ్యూజియాలు వంటి ఏర్పాటును విరమించుకోవాలి.
  5. వికేంద్రీకరణ తర్వాత అమరావతిలో మిగిలే విభాగాధిపతుల కార్యాలయాలను దృష్టిలో పెట్టుకునే టవర్ల పరిమాణాన్ని తగ్గించాలి.
  6. ఇక్కడ పునాదుల నిర్మాణానికి ఎక్కువ ఖర్చవుతున్నందున ఎత్తైన అపార్టుమెంట్లను నిర్మించరాదు.
  7. ప్రతిపాదిత రోడ్డు నెట్‌వర్క్‌, మౌలిక వసతుల పరిమాణాన్ని బాగా తగ్గించాలి.
  8. సీడ్‌యాక్సిస్‌ రోడ్డు వరకే ప్రభుత్వ భవనాల సముదాయం అభివృద్ధిని పరిమితం చేయాలి. పర్యావరణపరంగా ఎక్కువ ముప్పున్నందున కృష్ణా నది వైపు అభివృద్ధి సరికాదు.
  9. గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి సరికాదు.
  10. విజయవాడ- గుంటూరు మధ్య జాతీయ రహదారి పొడవునా ఇప్పటికే పెద్ద ఎత్తున నిర్మాణాలున్నాయి. అమరావతి అభివృద్ధి ఆ మార్గంలో కొనసాగాలి.

బీసీజీ నివేదికలోనూ ప్రస్తావన..!

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కూడా విశాఖ తుపానులు తాకే ప్రాంతంలో ఉందని పేర్కొంది. 2014లో విశాఖను తాకిన హుద్‌హుద్‌ను ప్రస్తావించింది. అక్కడ కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుచేస్తే ప్రభుత్వం అవసరమైన విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని, ఆధునిక విపత్తు నిర్వహణ సాంకేతిక పరిజ్ఞానాల్ని అందుబాటులో ఉంచాలని సూచించింది. అప్పుడే ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే నష్టాన్ని నియంత్రించగలమని పేర్కొంది.

ఇవీ చూడండి: ఎన్నికల్లో తెరాస ఆలోచనను ఈసీ అమలు చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.