తెలుగుదేశం పార్టీ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఇతర నాయకులు నివాళులు అర్పించారు. దళిత నేతగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి.. తొలి దళిత లోక్‌సభ స్పీకర్గా దేశానికి ఆదర్శవంతమైన సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు. తెలుగువారి ప్రతిభను, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను చాటిన దివంగత గంటి మోహనచంద్ర బాలయోగి తనకు అత్యంత ఆప్తుడని తెలిపారు.
సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించి.. తెలుగుదేశం నేతగా లోక్‌సభ స్పీకర్ స్థాయికి ఎదిగి, ఉత్తమమైన రాజకీయాలకు నిదర్శనంగా నిలిచిన నేత బాలయోగి అని లోకేశ్ కొనియాడారు. బాలయోగి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: 80ఏళ్ల వయసులో బామ్మ సేద్యం... కౌలు భూమిలో ప్రకృతి వ్యవసాయం