తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ లోకేష్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవన్‌లోని కార్యాలయంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఇదీ చూడండి : ఆరేళ్లలో కేసీఆర్ చేసింది శూన్యం: జీవన్ రెడ్డి