ప్రేమపేరుతో తన బావ మోసంచేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమ్మాయికి బావ అయిన సంతోష్... ప్రేమిస్తున్నానని చెప్పి లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు యువతికి వాట్సప్ ద్వారా సందేశం పంపాడు. తన బావ చేతిలో మోసపోయినట్లు గుర్తించిన అమ్మాయి... తీవ్ర మనస్తాపంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా... ఫలితం లేకపోయింది. వాట్సప్‌లో తన బావ పంపించిన సందేశం వల్లే తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.
ఈ కథనం చదవండి : ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి