ETV Bharat / state

కేటీఆర్​ పుట్టిరోజు కానుకగా  గిఫ్ట్​స్మైల్​ ఛాలెంజ్​ - trs

అధినేతల పుట్టినరోజులు అభిమానులు పండుగలా జరుపుకోవడం ఒకప్పుడు చూశాం... తమ అభిమాన నేత పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహించడం ఇప్పుడు చూస్తున్నాం. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు పుట్టిన రోజు వేడుకను ఒక సామాజిక సేవా కార్యక్రమంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు శ్రీకారం చుట్టారు. గిఫ్ట్​స్మైల్​ ఛాలెంజ్​ పేరుతో సేవా కార్యక్రమం మొదలెట్టారు.

కేటీఆర్​ పుట్టిరోజు కానుకగా  గిఫ్ట్​స్మైల్​ ఛాలెంజ్​
author img

By

Published : Jul 22, 2019, 8:59 PM IST

ఈనెల 24న పుట్టినరోజు జరుపుకోనున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను వినూత్న సామాజిక కార్యక్రమంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు శ్రీకారం చుట్టారు. ప్రకటనలు, బొకేల రూపంలో నగదును వృథా చేయకుండా ఆ డబ్బును సేవకు ఉపయోగించాలనే లక్ష్యంతో ట్విట్టర్​ వేదికగా గిఫ్ట్​స్మైల్​ ఛాలెంజ్​ పేరుతో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తాము సాయం చేసి మరికొందరిని నామినేట్​ చేయగా వారు ఛాలెంజ్​ స్వీకరించి భాగస్వాములవుతున్నారు.

ట్రెండింగ్​లో గిఫ్ట్​స్మైల్​

ఇప్పటికే ఎమ్మెల్సీ నవీన్​కుమార్​ ఈ సవాల్​ స్వీకరించి ఓ స్వచ్ఛంద సంస్థకు అంబులెన్స్​ కోసం పది లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. శశి కనపర్తి అనే ఎన్​ఆర్​ఐ నిశాంత్​ కేన్సర్​ ఫౌండేషన్​కు 500 డాలర్లు విరాళం ఇచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్​లో గిఫ్ట్​ స్మైల్​ ఛాలెంజ్​ ట్రెండింగ్​లో ఉంది. ఆపదలో ఉన్నామన్న వారిని తక్షణమే ఆదుకునే కేటీఆర్​ను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించామని ఆయన అభిమానులు చెబుతున్నారు.

దివ్యాంగులకు అవయవాలు సమకూర్చడం, రక్తదాన కార్యక్రమాలు, అనాథ, వృద్ధాశ్రమాల్లో భోజన పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో రక్షిత మంచినీటి ప్లాంట్లు వంటి సేవా కార్యక్రమాలు చేయాలని కేటీఆర్ సన్నిహితులు ఛాలెంజ్ విసురుతున్నారు. తెరాస శ్రేణులు కూడా ప్రచారంలో భాగస్వామ్యులవుతున్నాయి.

కేటీఆర్​ పుట్టిరోజు కానుకగా గిఫ్ట్​స్మైల్​ ఛాలెంజ్​
ఇదీ చూడండి: కేటీఆర్​ పేరుతో బైక్​ నెంబర్​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.