రాబోయే 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ రూ. 5,600 కోట్ల ముసాయిదా పద్దును సిద్ధం చేసింది. ప్రతిపాదనను గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సమావేశమైన స్థాయీ సంఘం సభ్యులు పరిశీలించారు. అంచనా పద్దును డిసెంబరు 10 స్థాయీ సంఘంలో ఆమోదింపజేసుకుని 15న పాలక మండలి సమావేశంలో ప్రవేశపెడతారు. జనవరి 10న పాలకమండలిలో చర్చించి ఫిబ్రవరి 20న తుది పద్దును ప్రకటిస్తారు. మార్చి 7 ప్రభుత్వానికి తెలియజేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత పద్దును రూ. 5,600 కోట్లకు సవరించినట్లు తెలిపింది. మేయర్ రామ్మోహన్, కమిషనర్ లోకేష్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదం పొందాయి.
రూపాయి రాక.. (రూ.కోట్లలో)
- ఆస్తిపన్ను.. 1850(32శాతం)
- స్థిర ఆదాయాలు(స్టాంపుడ్యూటీపై సర్‌ఛార్జి, వినోదపన్ను తదితర) 652.10(11శాతం)
- రుసుము, వినియోగదారుల ఛార్జీలు.. 1002.70(17శాతం)
- ఇతర ఆదాయాలు 66.20(1శాతం)
- ప్రణాళిక నిధులు 770.51(14శాతం)
- విరాళాలు 22.84
- క్రమబద్ధీకరణ, ఇతర రుసుములు 189.69(3శాతం)
- రుణాలు.. 1224.51(23శాతం)
రూపాయి పోక.. (రూ.కోట్లలో)
- జీతాలు, ఇతరత్రా ఖర్చులు 1226.91(22శాతం)
- నిర్వహణ వ్యయం 905.30(16శాతం)
- భూ అభివృద్ధి, ఇతర ఖర్చులు 281.79 (6శాతం)
- రహదారులు 1582(28శాతం)
- భూమి, భూ అభివృద్ధి 445.19(8శాతం)
- వరద నీటి కాలువలు 170.00(3శాతం)
- హరితహారం 560.00(10శాతం)
- నీటి సరఫరా, మురుగు కాల్వలు 131.87(2శాతం)
- ఇతర మూలధన వ్యయం 296.43(5శాతం).