ఇటీవల కరోనా వ్యాధితో మరణించిన జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో డ్రైవర్ సంగెం మల్లయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో డ్రైవర్ అసోసియేషన్ కోరింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం, ఎల్బీనగర్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్తో కలిసి సరూర్నగర్ శానిటేషన్ విభాగం డీఈ నీలిమకు వారు వినతిపత్రం అందజేశారు.
ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్న తాము అనేక ఇబ్బందులు పడుతూ కరోనాతో పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్సు, హెల్త్ కార్డులు కల్పించాలని శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని కోరారు. మరణించిన మల్లయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:ప్రైవేట్లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్