ETV Bharat / state

ఆదిలో కట్టడి.. ఇప్పుడేదీ? పిచికారీ నిలిపివేతపై విమర్శలు - హైదరాబాద్ కరోనా వార్తలు

హైదరాబాద్​లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కట్టడికి జీహెచ్‌ఎంసీ పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉండగా నెల రోజులుగా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ నిలిపివేసింది. కొవిడ్‌-19 కేసుల ప్రారంభంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన బల్దియా ఇప్పుడు ఆస్థాయిలో చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేమంటే వర్షంలో కొట్టుకుపోతుందని అధికారులు వింత సమాధానాలు ఇస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

coronavirus
coronavirus
author img

By

Published : Aug 7, 2020, 7:46 AM IST

రాష్ట్ర రాజధాని పరిధిలో 40 వేల వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కేసులూ కలుపుకొంటే నిత్యం 800 వరకూ ఉంటున్నాయి. పరీక్షలు సంఖ్య పెరిగితే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నగరంలో కరోనా కేసులు నమోదైన తొలినాళ్లలో వైరస్‌ నిరోధానికి నగరపాలకసంస్థ కఠిన చర్యలు తీసుకుంది. నగరవ్యాప్తంగా సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసే బాధ్యతను డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్సు విభాగానికి అప్పగించింది.

భారం లేకున్నా

దాదాపు 100 మంది సిబ్బంది రాత్రి పగలూ తేడాలేకుండా ప్రత్యేక వాహనాలపై అన్ని వీధుల్లో ద్రావణం పిచికారీ చేశారు. కరోనా బాధితులున్న ప్రాంతాల్లో చుట్టుపక్కల ఇళ్లకూ చల్లారు. మార్చి నుంచి జూన్‌ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పెద్దఎత్తున సాగింది. బహిరంగ ప్రదేశాల్లో వైరస్‌ కొంతమేర నశించింది. ఈ ప్రక్రియ వల్ల బల్దియాపై పెద్దగా భారం పడిందీ లేదు. అయినా వర్షం కారణంతో ప్రక్రియనే నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది.

బాధితులపై గతం కంటే తగ్గిన నియంత్రణ

ప్రస్తుతం నగరంలో సుమారు 15 వేల మంది కరోనా బాధితులున్నారు. 12 వేల మంది వరకు ఇళ్లలోనే వైద్యుల సూచనలతో చికిత్స పొందుతున్నారు. వీరిపై బల్దియా అధికారుల నిఘా పెద్దగా లేకపోవడంతో చాలామంది జనసమూహంలో తిరిగేస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఇతరులకూ మహమ్మారి సోకే ప్రమాదం ఉంది. బాధితులున్న ప్రాంతాల్లో రోజూ క్రిమి సంహారక ద్రావకాన్ని పిచికారీ చేస్తే నాశనం అయ్యే అవకాశం ఉన్నా దృష్టిసారించడంలేదు.

స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో లేవనెత్తిన సభ్యులు

ఇటీవల జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పలువురు సభ్యులు సోడియం హైపో క్లోరైట్‌ పిచికారీ అంశాన్ని లేవనెత్తారు. ఎందుకు చేయడంలేదని ఉన్నతాధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు బల్దియాలోని ఓ ఉన్నతాధికారి విచిత్ర వాదన చేస్తున్నారని కొందరు అధికారులే చెబుతున్నారు. ‘ప్రస్తుతం రోజూ వర్షం పడుతోంది. ద్రావకాన్ని చల్లితే కొట్టుకుపోతుంది. ఏమీ ఉపయోగం ఉండదు. కొంతకాలం ఆగాక పిచికారీ విషయాన్ని చూద్దాం’ అని ఆయన పేర్కొంటున్నట్లు అధికారులు అంటున్నారు. పోనీ దోమలను పారదోలే ఎంటమాలజీ విభాగమైనా ఇంటింటికి వెళ్లి ద్రావకాన్ని పిచికారీ చేస్తోందా అంటే అదీ లేదు. ఈ విభాగంలో 2 వేల మందికిపైగా సిబ్బంది ఉన్నా ఉపయోగం ఉండడం లేదు. వీరికి గ్లౌజులు, మాస్కులు ఇతర రక్షణ పరికరాలు సరిగా ఇవ్వలేదు. ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఆ ప్రభావం పిచికారీపై పడింది. ఈ వ్యవహారంపై కొంతమంది ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జోక్యం చేసుకొంటేనే సమస్య పరిష్కారమవుతుందని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.