ETV Bharat / state

GHMC: 'మ్యాన్​హోల్​లోకి దిగిన ఇద్దరూ మా సిబ్బంది కాదు' - ghmc statement on sanitation workers death issue

హైదరాబాద్​ సాహెబ్​నగర్​లో డ్రైనేజీలో దిగి చనిపోయిన ఇద్దరు కార్మికులు తమ సిబ్బంది కాదని జీహెచ్​ఎంసీ తెలిపింది. మృతులు కాంట్రాక్టర్​ వద్ద పనిచేసే వాళ్లని బల్దియా వెల్లడించింది. సాహెబ్​నగర్​ పద్మావతి కాలనీలో చేపట్టిన వరదనీటి పైప్​లైన్లు శుభ్రపరిచే పనులకు, జీహెచ్​ఎంసీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారు పనులు చేయించారని.. అతనిపై చర్యలు తీసుకుంటామని జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు.

ghmc
జీహెచ్​ఎంసీ
author img

By

Published : Aug 4, 2021, 1:33 PM IST

హైదరాబాద్​ ఎల్బీనగర్​ నియోజకవర్గ పరిధిలోని సాహెబ్​నగర్​లో డ్రైనేజీ శుభ్రం చేస్తూ చనిపోయిన ఇద్దర కార్మికులు తమ సిబ్బంది కాదని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. మృతులు బి. ఎల్లయ్య అనే కాంట్రాక్టర్‌ వద్ద పనిచేసే వారుగా గుర్తించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పద్మావతి కాలనీలో చేపట్టిన వరదనీటి లైన్లను శుభ్రపరిచే పనులకు, జీహెచ్‌ఎంసీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

చర్యలు తీసుకుంటాం

గుత్తేదారు ఎల్లయ్యకు సాహెబ్​నగర్, వడ్డెర బస్తీ, హరిహరపురం, బాలాజీనగర్, ఎస్‌కేడీ నగర్ తదితర కాలనీల్లోని వరదనీటి మ్యాన్‌హోళ్లు, పైపులైన్ల నుంచి పూడిక తొలగింపు కోసం రూ. 12.70లక్షలతో పనులు అప్పగించామని అధికారులు వివరించారు. బకెట్​తో మాత్రమే పూడిక తొలగించేందుకు జీహెచ్​ఎంసీ అనుమతిచ్చిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌ పూడికతీత పనులు చేయించారని అధికారులు పేర్కొన్నారు. అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదీ చదవండి: GHMC: మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

మంగళవారం రాత్రి సాహెబ్​నగర్​ పద్మావతి కాలనీలో వరదనీటి కాలువ నుంచి బకెట్‌ మెషిన్ ద్వారా చేపట్టిన పూడిక తొలగింపులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వరదనీటి లైన్ల క్లీనింగ్ కోసం వాళ్లు దాదాపు పది అడుగుల లోతు ఉన్న మ్యాన్​హోల్ కవర్ తెరిచారు. ఆ కాలనీల గుండా వెళుతున్న వరద కాలువ.. ఇటీవల వర్షాల కారణంగా నిరంతరం పొంగిపోర్లుతోందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారని జీహెచ్​ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా డివిజన్​ కార్పొరేటర్, హయత్‌నగర్ డీసీ, ఈఈ, ఇంజినీరింగ్ సబార్డినేట్లు ఈ కాలనీలను సందర్శించి ప్రతిపాదనలు పంపారని చెప్పారు. వారి ప్రతిపాదనలతో ఈ నాలాను బకెట్​తో పూడిక తొలగింపు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అనుమతించిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: TS HC Notice : కాకతీయ, తెలుగు వర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.