GHMC Start Hussain Sagar Cleaning Process in Hyderabad : హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్(Hussain Sagar)లో గణనాథుల నిమజ్జనంతో భారీగా వ్యర్థ పదార్థాలు వచ్చి చేరాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు వాటిని తొలిగించే పనుల్లో నిమగ్నమయ్యారు. చెత్తను తొలగించేందుకు స్వీపింగ్ యంత్రాలు వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్ని చెరువుల దగ్గర గణేశ్ నిమజ్జనాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో.. వ్యర్థాల తొలిగింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఎక్కువగా నిమజ్జనం చేసిన హుస్సేన్‌సాగర్ వద్ద అధికారులు మరింత వేగవంతంగా శుభ్రం చేసేందుకు తగిన చర్యలు చేపట్టారు. సాగర తీరంలో ఉన్న వ్యర్థాలను క్రేన్ల సాయంతో తొలిగిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రత్యేక వాహనాల్లో పారిశుద్ధ్య కార్మికులు తరలిస్తున్నారు. పూలు, సామగ్రి, కాగితాలు, ఇతర చెత్తను తొలగించి.. మునుపటిలా శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
Hussain Sagar Cleaning Operation : సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాల అనంతరం.. జలాశయాల్లో ఉన్న వ్యర్థాలను వీలైనంత తక్కువ సమయంలో తొలగించాలి. దీని ప్రకారమే జీహెచ్ఎంసీ అధికారులు చెత్తను వెలికి తీసే పనులు చేపట్టారు. ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనోత్సవం విజయవంతంగా పూర్తైంది. భారీగా భక్త జనం, శోభాయాత్రలు, లంబోదరుల వీడ్కోలు.. ముగిసిన తరుణంలో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్‌లో భారీగా వ్యర్థాలు పేరుకుపోయాయి. రోడ్లపై కూడా అంతా ప్లాస్టర్ ఆప్ ప్యారీస్, ఇనుము, చెక్కలు, కర్రలు వాహనాల రాకపోకలకి కాస్త అడ్డంగా ఉన్నాయి. ఇవాళ్టితో హుస్సేన్‌సాగర్ చుట్టు ఉన్న రోడ్లపై పారిశుద్ధ్య పనులను పూర్తి చేయడమే కాకుండా.. నిమజ్జనం చేసిన విగ్రహాలను బయటకి తీసి వాహనాల్లో తరలించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇతరులు మరికొంత మంది ఇనుప చువ్వలను తీసుకెళ్తున్నారు.
Ganesh Idols Garbage Remove at Hussain Sagar : కొన్నిచోట్ల రోడ్డుపైకి మురికి నీరు చేరడంతో దుర్వాసన వస్తుందని.. దాన్ని వెంటనే శుభ్రం చేసేందుకు స్వీపింగ్ యంత్రాల సాయంతో పారిశుద్ధ్య పనులు(Sanitation works) ఏకకాలంలో చేపట్టారు. గత రెండు రోజులుగా ఓ వైపు నిమజ్జనం.. మరోవైపు నీటిలో, రోడ్డు పక్కన ఉన్న చెత్తను కార్మికులు తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టారు. అవసరమైన వాటి దగ్గర యంత్రాలను, క్రేన్లను వినియోగిస్తున్నారు. ప్రతి ఏడాది ఈ విధంగా జరుగుతుందని ముందే తెలిసినందున చెత్తను సేకరించేందుకు సులభమైన పనులు.. దీంతో పాటు తక్కువ సమయంలో పూర్తిగా శుభ్రం చేసేందుకు అధికారులు మెలుకువలు ఉపయోగిస్తున్నారు. వేల సంఖ్యలో వచ్చిన గణేశ్‌ని విగ్రహాలను, నీటిపై తేలుతున్న పూల దండలు, వ్యర్థాలను తొలగిస్తూ.. నీటి నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టారు. ఇవాళ్టితో చెత్తను తొలగించి మునుపటిలా అందంగా ఉండేలా చేసేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
Hussain Sagar Hyderabad News : కోట్లు ఖర్చు చేసినా.. ఏళ్లు గడుస్తున్నా.. మారని సాగర్ కథ