ట్రాఫిక్ ఐలాండ్ల నిర్మాణం....
శేరిలింగంపల్లి సర్కిల్లోని బొటానికల్ గార్డెన్ నుంచి మజీద్‌బండ వరకు 2 కిలోమీటర్ల మార్గంలో ఉన్న సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్లను సీఎస్సార్ కింద నిర్వహించేందుకు మేసర్స్ చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు కేటాయించారు. మైండ్‌స్పెస్ జంక్షన్ నుంచి గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్ వరకు సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్‌ను సీఎస్సార్ కింద ఒక ఏడాది నిర్వహించేందుకు ఆమోదించారు. ఎస్సార్‌డీపీ పథకానికి రూపీ టర్మ్ లోన్ కింద రూ.2,500కోట్లను సేకరించడానికి అరేంజర్‌గా ఎస్‌బీఐ క్యాప్స్‌ను 0.10 శాతం ఫీజుతో నియమించేందుకు అంగీకరించారు.
జీహెచ్ఎంసీలోనూ పలు తీర్మాణాలు...
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఓటీ టాయిలెట్ల నిర్వహణను సఫాయికర్మచారిలకు పదేళ్లపాటు కేటాయించడం.... టెండర్లలో పాల్గొనే మేతర, వాల్మీకి వర్గానికి చెందినవారికి సెక్యురిటీ డిపాజిట్‌ను రూ.50వేల నుంచి రూ.20వేలకు తగ్గించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీలో న్యాక్ ద్వారా నియమితులై పనిచేస్తున్న 250 మంది ఔట్‌సోర్సింగ్ సైట్ ఇంజినీర్లు, ఇద్దరు సీనియర్ కన్సల్టెంట్ల సేవలను మరో ఏడాది పాటు పొడగించేందుకు పచ్చజెండా ఊపారు. ఇబ్రహీంబాగ్ తారమతిబారాదారి రహదారి నుంచి పెద్ద చెరువు వరకు రూ.3.90 కోట్ల వ్యయంతో సీవరేజ్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: "జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"