ETV Bharat / state

యాచ‌కుల‌ను తరలిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది - GHMC latest news

యాచ‌కుల‌ు, వలస కార్మికులను జీహెచ్ఎంసీ సిబ్బంది వసతిగృహాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లోని బ‌స్ షెల్టర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మెట్రో స్టేష‌న్ల వద్ద ఉన్నవారికి సంరక్షణ కల్పిస్తున్నారు. ఖైర‌తాబాద్‌లో 22 మంది యాచ‌కుల‌ను విక్టరీ ప్లేగ్రౌండ్‌ వసతి గృహాలకు తరలించారు.

ghmc-staff-moving-beggars-in-hyderabad-area
యాచ‌కుల‌ను తరలిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది
author img

By

Published : Apr 20, 2020, 8:48 PM IST

లాక్‌డౌన్ నేప‌థ్యంలో అనాథ‌లు, నిరాశ్రయులు, యాచ‌కుల సంక్షేమంపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. రెగ్యుల‌ర్‌గా నిర్వహిస్తున్న 12 షెల్టర్ హోంల‌తోపాటు తాత్కాలికంగా మ‌రో 13 షెల్టర్లను నిర్వహిస్తోంది. అలాగే 85 స్వచ్ఛంద సంస్థల స‌హ‌కారంతో పలు ప్రాంతాల్లో ఆశ్రయం క‌ల్పిస్తున్నారు. మొత్తం 4608 మంది నిరాశ్రయులు, అనాథ‌లు, యాచ‌కుల‌కు భోజ‌న వ‌స‌తులు క‌ల్పించి వారి ఆరోగ్య సంర‌క్షణ‌కు కూడా చ‌ర్యలు తీసుకుంటోంది.

న‌గ‌రంలో వివిధ ప్రాంతాల్లో బ‌స్ షెల్ట‌ర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మెట్రో రైలు స్టేష‌న్ల దగ్గర ఉంటున్న యాచ‌కుల‌ను కూడా గుర్తించి షెల్టర్ హోంల‌కు త‌ర‌లించాల‌ని సంక‌ల్పించింది. ఈ మేర‌కు డిప్యూటి క‌మిష‌న‌ర్లు, అసిస్టెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్లకు బాధ్యత‌లు అప్పగించారు. అందులో భాగంగా ఖైర‌తాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఉన్న 22 మంది యాచ‌కుల‌ను గుర్తించి ప్రత్యేక వాహ‌నంలో విక్టరీ ప్లేగ్రౌండ్‌కు త‌ర‌లించారు.

ghmc-staff-moving-beggars-in-hyderabad-area
యాచ‌కుల‌ను తరలిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది

ఇదీ చూడండి : మిస్​ కాల్​ ఇస్తే చాలు.. ఇంటి వద్దకే పండ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.