పనికిరాని వస్తువుల సేకరణ కోసం... జీహెచ్‌ఎంసీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు విశేష స్పందన లభిస్తోంది. నిరుపయోగంగా ఉన్న వస్తువులను ఇంటి వద్ద నుంచే సేకరిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సోమాజిగూడలో... నగర మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఈ నెల 12 వరకు చేపట్టనున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు 42 మెట్రిక్ టన్నులకుపైగా వ్యర్థపదార్థాలు సేకరించారు. ఇళ్లలో పనికిరాని వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా జీహెచ్ఎంసీకి అందజేయాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. పనికిరాని వస్తువులన్నింటినీ రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేయడం వల్ల... రోడ్లపై మురుగునీరు చేరుతోందన్నారు.
ఇవీచూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ