హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని చైతన్యపురిలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల పాదాలకు చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి పాలాభిషేకం చేశారు. అనంతరం వారి సేవలను కీర్తిస్తూ సన్మానం చేశారు. కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వీధులు, ఇళ్లు శుభ్రపరుస్తున్నారని విఠల్ రెడ్డి కొనియాడారు. సమాజానికి ఇంతటి గొప్ప సేవ చేస్తోన్న కార్మికులకు... మే'డే' సందర్భంగా పాదాలకు పాలాభిషేకం చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అన్ని వేళల్లో తాను కార్మికులకు అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల పాదాలకు కార్పొరేటర్ పాలాభిషేకం - FELICITATION TO GHMC SANITATION WORKERS
హైదరాబాద్లోని చైతన్యపురిలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పాదాలకు కార్పొరేటర్ పాలాభిషేకం చేశారు.