ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మనం దేన్ని ముట్టుకున్నా ఒకటికి రెండుసార్లు చేతులు కడుక్కుంటున్నాం. శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నాం. కానీ పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలో మెడ లోతున దిగి వ్యర్థాలను తొలగిస్తున్నారు. రక్షణ వస్త్రాలు లేకుండానే ప్రమాదకర పరిస్థితిలో విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ బేగంబజార్‌లోని ప్రధాన డ్రైనేజి(ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిని ముంచెత్తిన మురుగునీరు దీని నుంచే వెళుతుంది)లో ఓ కార్మికుడు మంగళవారం మ్యాన్‌హోల్‌లోకి దిగి వ్యర్థాలను తొలగిస్తుండగా ‘ఈనాడు’ తీసిన చిత్రమిది.