హైదరాబాద్‌లో దుకాణాలకు సరి బేసి విధానంలో తెరిచేందుకు జీహెచ్ఎంసీ అనుమతినిచ్చింది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో బల్దియా అధికారులు పర్యటిస్తున్నారు. దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇస్తున్నారు. సరి బేసి విధానం పాటించకపోతే దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. దుకాణదారు మాస్క్ ధరించి శానిటైజర్ అందుబాటులో ఉంచాలని వెల్లడించారు. మాస్క్ ధరించిన వినియోగదారుకే సరకులు ఇవ్వాలని సూచించారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించనున్నారు. కంటైన్మెంట్ జోన్లలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి షాపులు తెరుచుకోవు.
నగరంలో దుకాణాలు తెరుచుకున్నాయ్.. అతిక్రమిస్తే అంతే ఇక! - GHMC sanction to open stores
హైదరాబాద్‌లో దుకాణాలు తెరుచుకున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సరి బేసి విధానంలో తెరిచేందుకు అనుమతినిచ్చారు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో బల్దియా అధికారులు పర్యటిస్తున్నారు.