ETV Bharat / state

బీ-ఫారాలు అందించేందుకు రేపటివరకు గడువు - Withdrawal of nomination for GHMC elections

గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు బీ-ఫారం సమర్పించేందుకు రేపటి వరకు గడువు ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు.​ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

parthasarathi
parthasarathi
author img

By

Published : Nov 21, 2020, 3:24 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఎన్నికకు నామనేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు బీఫారం సమర్పించేందుకు రేపటి వరకు గడువు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. రేపు నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని.... ఆ సమయంలోపు బీఫారాన్ని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించాలన్నారు.

నామినేషన్లు ముగిసినందున నిన్నటి వరకే ఏ-ఫారం అందించే గడువు ముగిసింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.