హైదరాబాద్ గచ్చిబౌలి హెచ్సీయూలో జీహెచ్ఎంసీ, ఒక ప్రైవేటు సంస్థ కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని పూనుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి రావాల్సి ఉండగా... ఆయన రాకపోవడంతో మొక్కలను యూనివర్సిటీలో వృథాగా వదిలేశారు. మొక్కలు ఎండిపోయి ప్లాస్టిక్ కవర్లు మిగిలాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని స్థానికులు వాపోతున్నాయి.
ఇవీ చూడండి : 'గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కావొద్దు'