ETV Bharat / state

సందడిగా జీహెచ్​ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణోత్సవం

జీహెచ్​ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సందడిగా జరిగింది. తమకు అనుకూలమైన భాషలో ప్రమాణం చేసేందుకు అనుమతివ్వాలని వివిధ పార్టీలు.. అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి నచ్చిన భాషలో ప్రమాణస్వీకారానికి అనుమతిచ్చారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.

ghmc-new-corporators-take-oath-in-four-languages
సందడిగా జీహెచ్​ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
author img

By

Published : Feb 11, 2021, 12:17 PM IST

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్‌ ఎన్నిక కోసం జరిగిన సమావేశంలో.. కొత్త కొర్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన వివిధ పార్టీలకు చెందిన 149 మంది కార్పొరేటర్లు... ర్యాలీగా జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి తరలివచ్చారు. అనంతరం ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో ప్రత్యేకంగా సమావేశయయ్యారు. ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన సభ్యులు నాలుగు భాషలు - తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లంలో ఎవరికి అనుకూలమైల భాషలో వారిని ఒక గ్రూపుగా ప్రమాణం స్వీకారం చేయించారు. తెలుగు అక్షర మాల ప్రకారం అభ్యర్థులతో ప్రమాణం చేయించాలని తొలుత నిర్ణయించినా.. పార్టీల సూచనతో మేరకు ఎన్నికల నిర్వహణ అధికారి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

సామూహికంగా..

తొలుత తెలుగులో ప్రమాణం చేయించాలనుకున్న కార్పొరేటర్లతో... శ్వేతా మహంతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఉర్దూ, హిందీ, ఆంగ్లంలో సభ్యులతో ఎన్నికల నిర్వహణ అధికారి సామూహికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత సభ్యుల నుంచి సంతకంతోపాటు జీహెచ్​ఎంసీ పంపిన లేఖ, ఎన్నికల సంఘం ఇచ్చిన గెలుపు పత్రం లేఖలను అధికారులు వారి వద్ద నుంచి సేకరించారు.

జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లకు డిసెంబర్‌ 1న ఎన్నికలు నిర్వహించగా... డిసెంబర్‌ 4న ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ ఎన్నికల్లో అధికార తెరాస 56 స్థానాలు గెలుపొందగా.. భాజపా తరపున 48 మంది అభ్యర్థులు విజయం సాధించారు. మజ్లిస్‌ పార్టీ 44 డివిజన్లలో విజయం సాధించగా.. కాంగ్రెస్ పోటీ చేసిన వారిలో కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. అయితే లింగోజిగూడ కార్పొరేటర్ రమేశ్‌గౌడ్‌ మృతితో 149 మంది కార్పొరేటర్లతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇదీ చూడండి: జీహెచ్‌ఎంసీ తెరాస మేయర్, డిప్యూటీ మేయర్​ అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.