ETV Bharat / state

'నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి' - mayor vijayalaxmi tributes to ambedkar

హైదరాబాద్​లో డా. బీఆర్​ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్యాంక్​బండ్​లోని అంబేడ్కర్​ విగ్రహానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు.

mayor vijayalaxmi tributes to ambedkar
అంబేడ్కర్​కు జీహెచ్​ఎంసీ మేయర్​ నివాళులు
author img

By

Published : Apr 14, 2021, 4:42 PM IST

సమ సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్​బండ్​ వద్ద ఆయన విగ్రహానికి మేయర్​ పూలమాల వేసి నివాళులర్పించారు.

అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మేయర్​ అన్నారు. ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్​ మోతే శ్రీలత, పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అంబేడ్కర్​కు నివాళులర్పించిన గద్దర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.