యుఎన్ ఆధ్వర్యంలో జరిగే మేయర్ల సదస్సుకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి ఆహ్వానం అందింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై... యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న గ్లోబల్ మేయర్ల సమావేశంలో పాల్గొననున్నారు.
ప్రపంచంలోని 40 నగరాలకు చెందిన మేయర్లకు మాత్రమే ఈ వెబ్‌ఆధారిత సదస్సులో పాల్గొనే అవకాశం లభించగా.. భారత్ నుంచి హైదరాబాద్ మేయర్‌కు మాత్రమే దక్కింది. మెల్‌బోర్న్, టోక్యో, జకార్త, రియోడిజెనీరో, పారిస్, మిలాన్, మాంట్రియల్, బార్సిలోనా, జోహెన్నెస్‌బర్గ్ తదితర నగరాల మేయర్లతోపాటు గద్వాల్ విజయలక్ష్మి సదస్సులో ప్రసంగిస్తారు.
ఈ నెల 16వ తేది ఉదయం 10:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరిగే ఈ సదస్సులో ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ స్వాగతోపాన్యాసం చేయనున్నారు. ఈ సదస్సు నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్న లాస్ ఎంజెల్స్ మేయర్ ఎరిక్ గర్సెట్టి సైతం అధ్యక్ష స్థానంలో ఉపన్యాసం చేస్తారు.
ఇదీ చదవండి: గగన్‌యాన్‌పై సహకారం కోసం భారత్-ఫ్రాన్స్ ఒప్పందం