హైదరాబాద్ రామంతపూర్ డివిజన్లో జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. మేడిపల్లి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్యవసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సుమారు 400 మంది పేదలకు వివిధ రకాల సరకులను అందించారు. ఈ సందర్భంగా వినయ్‌రెడ్డిని మేయర్ అభినందించారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆకాంక్షించారు.
ఇవీచూడండి: పంజాగుట్టలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కేటీఆర్