కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో విశిష్ట సేవలు అందిస్తోన్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నిలిపేసిన వేతనంతో మంజూరు చేశారు. అదనంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి 7 వేల 5 వందల రూపాయలను సీఎం కేసీఆర్ ప్రోత్సాహకంగా ప్రకటించారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ప్రకటనతో జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తోన్న సుమారు 18 వేల 550 మంది పారిశుద్ధ్య కార్మికులు, 2 వేల 375 మంది ఎంటమాలజి సిబ్బంది, 1,100 మంది ఎన్ ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగానికు చెందిన సిబ్బందికి లబ్ధి చేకూరుతుందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. సీఎం కేసీఆర్‌కి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసియుద్దీన్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో విస్తరిస్తోన్న కరోనా.. 364 కేసులు నమోదు