ETV Bharat / state

'ప్లాస్టిక్ బంద్​పై జీహెచ్​ఎంసీ నజర్'... చెత్తలో 20 శాతానికిపైగా ప్లాస్టికే

రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం...అనేక అనర్థాలకు దారి తీస్తోంది. ప్లాస్టిక్ వాడకం ప్రపంచ వ్యాప్తంగా చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నగరంలోని నాలాల్లో ప్లాస్టిక్ నిండిపోయి వరదనీటికి ఆటంకంగా మారి వరదలకు కారణం అవుతోంది.

ప్రజలందరూ సహకరిస్తేనే  ప్లాస్టిక్ బారి నుంచి గట్టెక్కుతాం : జీహెచ్​ఎంసీ
author img

By

Published : Nov 2, 2019, 8:55 AM IST

హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జీహెచ్ఎంసీ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్లాస్టిక్ ఉత్పత్తి నుంచి వాడకం వరకు నియంత్రణ జరగాలని వక్తలు అభిప్రాయడ్డారు.
నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 20 శాతానికి పైగా ప్లాస్టిక్ ఉంటున్నట్లు బల్దియా అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో చాలా వరకు రీసైకిల్ చేయడానికి వీలు లేనటువంటి ప్లాస్టిక్ ఉంటుంది. ప్రధానంగా ఆహార పదార్థాలను, నిత్యవసరాలను తీసుకెళ్లేందుకు..ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగిస్తున్నారు. ఇది మళ్లీ రీసైకిల్ చేయడానికి వీలు లేకుండా ఉంటోంది. అలాంటి వాటిని నిషేధించడం శుభ పరిణామమని అంటున్నారు నిపుణులు. పర్యావరణానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్ నియంత్రణ కోసం... అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. రీసైక్లింగ్ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్లాస్టిక్​ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున ఉపాధి ...
ప్లాస్టిక్ ఇండస్ట్రీపై ప్రజలు పెద్ద సంఖ్యలో ఆధారపడి ఉన్నారని దానిని పూర్తిగా నిషేధించడం సరికాదని ప్లాస్టిక్ తయారీ, ఉత్పత్తి అసోషియేషన్ ప్రతినిధులు అంటున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల అవసరం ఎంతో సులువైన పనిగా ఉందని... అందువల్లే వాటి వినియోగం బాగా పెరిగిందంటున్నారు. గతంతో పోలిస్తే మరింత ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం పెరిగిన నేపథ్యంలో రీసైక్లింగ్ చేయడమే పరిష్కారమార్గం అంటున్నారు ప్రతినిధులు.
ప్లాస్టిక్​తో నాలాలు జామ్...ఆపై వరదముప్పు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లాస్టిక్ అనేది చాలా సమస్యలకు కారణం అవుతున్నందున దానిని నియంత్రించడమే లక్ష్యంగా బల్దియా ముందుకు వెళ్తోంది. ప్లాస్టిక్​తో నాలాలు జామ్ కావడం వల్ల వరదముప్పు ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం కల్పించడం, కాదంటే జరిమాన కూడా వేస్తున్నామన్నారు జోనల్ కమిషనర్.
ప్రజలందరూ సహకరించినప్పుడే ప్లాస్టిక్ ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి వీలు అవుతుందంటున్నారు అధికారులు.

ప్రజలందరూ సహకరిస్తేనే ప్లాస్టిక్ బారి నుంచి గట్టెక్కుతాం : జీహెచ్​ఎంసీ

ఇవీ చూడండి : ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీపై హైకోర్టు అసహనం వ్యక్తం

TG_HYD_02_02_Ghmc_Focus_On_Plastic_Pkg_3182301 నోట్ః ఈ కింది ఫైల్ లో కూడా కొన్ని బైట్లు ఉన్నాయి వాడుకోగలరు TG_HYD_46_01_Seminar_On_Plastic_Waste_Management_Avb_3182301 Reporter: Kartheek () హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ నియంత్రణపై వర్క్ షాప్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్లాస్టిక్ ఉత్పత్తి దగ్గరి నుండి వాడకం వరకు నియంత్రణ జరగాలని వక్తలు అభిప్రాయడ్డారు. హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 20 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయంటే ప్లాస్టిక్ వినియోగం ఎలాఉంటుందో అర్థచేసుకోచ్చు. Look వాయిస్ ఓవర్ః రోజు రోజుకు పేరిగిపోతున్న ప్లాస్టిక్ అనేక అనార్థాలకు కారణం అవుతోంది. ప్లాస్టిక్ వాడకం ప్రపంచంతోపాటు మన దేశంలో, మన నగరంలోనూ చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. నగరంలో నాలాల్లో నిండిపోయి వరదనీటికి ఆటంకంగా మారి వరదలకు కారణం అవుతుంది. చెరుల్లోభూగర్బంలోకి చేరి నీరూ భూమిలోకి ఇంకడానికి కలుషితం కావడానికి కారణం అవుతోంది. అంతే కాకుండా జీవజాలానికి పెను ముప్పుసక్రమిస్తుందని అనేక పరిశోదనలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వాలు పాక్షికంగా ప్లాస్టిక్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలితాలను ఇవ్వడంలేదు. దాంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకు పేరిగిపోతుంది. వాయిస్ ఓవర్ః హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 20 శాతంపైగా ప్లాస్టిక్ ఉంటున్నట్లు బల్దియా అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇందులో చాలా వరకు రిసైకిల్ చేయ్యడానికి వీలు లేనటువంటి ప్లాస్టిక్ ఉంటుంది. ప్రధానంగా ఆహార ప్రదార్థాలను, నిత్యవసరాలను తీసుకెళ్లేందుకు..ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా ఒకేసారి వాడే ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నారు నగర ప్రజలు. దానిని మళ్లి రిసైకిల్ చేయ్యడానికి వీలు లేకుండా ఉంటుందని...., అలాంటి వాటిని నిషేదించడం మంచి పరిణామం అంటున్నారు నిపుణులు. పర్యావరణానికి ఇబ్బందులు తెచ్చిపేడుతున్న ప్లాస్టిక్ నియంత్రణకోసం అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రత్యామ్నాయాలు చూడాల్సిన అవసరం ఉందని..., రిసైక్లింగ్ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని అంటున్నారు. బైట్: సౌమ్య, డిప్యూటి డైరెక్టర్, ఇక్లి సౌత్ ఏషియా వాయిస్ ఓవర్ః ప్లాస్టిక్ ఇండస్ట్రీపై పెద్ద సంఖ్యలో ప్రజలు ఆధారపడి ఉన్నారని..., దానిని పూర్తిగా బ్యాన్ చేయ్యడం సరికాదని ప్లాస్టిక్ తయారీ, ఉత్పత్తి అసోషియేషన్ ప్రతినిధలుదులు అంటున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల అవసరం ఎంతో సులువైన పనిగా ఉందని అందువల్లే వాటి వినియోగం భాగా పేరిగిందంటున్నారు. గతంలో పోలిస్తే మరింత ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం పేరుతున్న తరుణంలో రిసైక్లింగ్ చేయ్యడమే పరిష్కారమార్గం అంటున్నారు. అయితే ఒకేసారి వాడేది ఎలాంటివి... రిసైకిల్ ఎలాంటివి చేయాలి అనే అంశాలను చూశాకే నియంత్రణ చర్యలు తీసుకోవాలంటున్నారు. రిసైకిల్ కోసం ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఎంతైన ఉందంటున్నారు ప్లాస్టిక్ తయారీ అసోషియేషన్ ప్రతినిధులు. బైట్: అనిల్ రెడ్డి, ప్లాస్టిక్ తయారీ అసోషియేషన్ ప్రతినిధి వాయిస్ ఓవర్ః గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లాస్టిక్ అనేది చాలా సమస్యలకు కారణం అవుతున్నందునా దానిని నియంత్రించడమే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నామని బల్దియా అధికారులు అంటున్నారు. ప్లాస్టిక్ తో నాలాల జామ్ కావడం అందువల్ల వరదముప్పు ఏర్పడటం...అంతే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లితుందని వాటి నుంచి బయటపడేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందుకోసం ప్రజల్లో చైతన్యం కల్పించడంతోపాటు మారని వారికి జరిమాన కూడా వేస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి నప్పుడు మాత్రమే ప్లాస్టిక్ ఇబ్బందులనుండి గట్టెక్కడానికి వీలు అవుతుందంటున్నారు అధికారులు. బైట్: శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఎండ్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.