సుప్రీం కోర్టు (Supreme court) ఆదేశాల మేరకు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాల (ganesh immersion) అనంతరం... జలాశయాల్లో చెత్తాచెదారం తొలగించే (removing immersed idols) పనుల్లో జీహెచ్‌ఎంసీ నిమగ్నమైంది. ప్రశాంత వాతావరణం నడుమ వినాయక నిమజ్జనోత్సవం విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ తీరంలో వ్యర్థాల వెలికిత పనులు (removing immersed idols) చేపట్టారు. భారీ శోభాయాత్రలు, లంబోదరుల వీడ్కోలు... ముగిసిన తరుణంలో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్‌లో గణేష్ నిమజ్జనం (ganesh immersion) అనంతరం పేరుకుపోయిన వ్యర్థాలను (removing immersed idols) జీహెచ్‌ఎంసీ సిబ్బంది, కార్మికులు తొలగిస్తున్నారు. రోడ్లపై కూడా పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు.
వేయిమందితో క్లీనింగ్
సుందరీకరణ పునరుద్ధరింపు పనుల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు నిమగ్నయ్యారు. వ్యర్థాల తొలగింపుల్లో (removing immersed idols) అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, ఇనుము, చెక్కలు, కర్రలు బయటపడుతున్నాయని జీహెచ్‌ఎంసీ సిబ్బంది తెలిపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మొత్తం 1000 మందికిపైగా జీహెచ్‌ఎంసీ వివిధ విభాగల సిబ్బంది, ఒప్పంద, పొరుగు సేవల కార్మికులు, రోజు వారీ కూలీలు ఈ పనుల్లో నిమగ్నమై అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. నేటితో హుస్సేన్‌సాగర్ చుట్టూ రోడ్లపై పారిశుద్ధ్యం పనులను పూర్తి చేయడమే కాకుండా... సాగర్‌లో నిమజ్జనం (ganesh immersion) చేసిన విగ్రహాల వ్యర్థాలు మొత్తం బయటకు తీసి... వాహనాల్లో తరలించేలా జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటుంది.
దుర్గంధం రాకుండా చర్యలు
సోమవారం ఉదయం నుంచి 10 అడుగులు పైన ఉన్న 2500కు పైగా గణనాథుల విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం (ganesh immersion) చేశారు. ఈ క్రమంలో రోడ్లన్నీ చెత్తా చెదారం, కాగితాలతో నిండిపోయింది. రోడ్లకు ఇరువైపులా బురద, నీరు చేరింది. ఒకపక్క విగ్రహాల నిమజ్జనం చేసిన వెంటనే వ్యర్థాలు తొలగింపు (removing immersed idols) పనులు, మరోపక్క రోడ్లపై స్వీపింగ్ యంత్రాల సాయంతో పారిశుద్ధ్య పనులు ఏకకాలంలో చేపట్టారు. దుర్గంధం వెదజల్లకుండా ఉండేందుకు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు (Supreme court) ఆదేశాల మేరకు సాధ్యమైనంత వరకు వ్యర్థాలు హుస్సేన్‌సాగర్‌లో పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పత్రి, పూలు, ఇతరత్రా అన్నీ కూడా బయటే సేకరించడం వల్ల పని సులువైందని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.
ఫ్రెండ్లీ పోలీస్
హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయని... హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ (Hyderabad CP Anjanai Kumar) వెల్లడించారు. 20వేలకు పైగా విగ్రహాలు సాగర్‌లో నిమజ్జనమయ్యాయని తెలిపారు. ఈ మహాక్రతువులో హోంగార్డు నుంచి పోలీస్ ఉన్నతాధికారి వరకు ఎంతో కష్టపడి పనిచేశారని... ప్రజలు కూడా పోలీసులకు ఎంతో సహకరించారన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా భక్తులకు.. పోలీసులు శోభాయాత్ర, నిమజ్జనంలో బాసటగా నిలిచారని అంజనీ కుమార్ వెల్లడించారు.
రాకపోకలు పునరుద్ధరణ
ట్యాంక్‌బండ్‌పై రెండు వైపులా సాధారణ రాకపోకలు పునరుద్ధరించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి తెలుగుతల్లి వంతెన, ఖైరతాబాద్ వైపు వాహన రాకపోకలకు మార్గాలు తెరవడంతో... సాధారణ సమయాల తరహాలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచే కాకుండా రాచకొండ, సైబరాబాద్ నుంచి గణపతి విగ్రహాల రద్దీ దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత అన్ని రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్