హైదరాబాద్‌లో దోమలను నివారించేందుకు బల్దియా అధికారులు(Ghmc taken actions on mosquitoes) నడుం బిగించారు. సాంకేతికత ఆధారంగా వినూత్నంగా చర్యలు చేపట్టారు. ఈ విధానంలో నూతన పద్ధతుల ద్వారా లార్వా దశ నుంచే దోమల నివారణ చర్యలు(mosquitoes control in GHMC) చేపడుతున్నారు. దీనికోసం తెలంగాణ మస్కిటో డిజిటల్ సొల్యూషన్స్ (TMEDS) ద్వారా జీహెచ్ఎంసీలో పైలెట్ ప్రాజెక్ట్(ghmc pilot project on mosquitoes) ప్రారంభించారు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికత వినియోగం
అర్బన్ మలేరియా పథకంలో భాగంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(Internet of things) సాంకేతికత ఆధారంగా పరికరాలను ఫాగింగ్ యంత్రాలకు అమర్చారు. ఈ పైలెట్ ప్రాజెక్టులో 10 పోర్టబుల్ ఫాగింగ్ యంత్రాలతో పాటు మరో 64 వెహికిల్ మౌంటెడ్ యంత్రాలను వినియోగించునున్నారు. ఈ మొత్తం 74 యంత్రాలకు స్మార్ట్ ట్రాకర్‌ను అమర్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
డ్యాష్‌బోర్డుకు అనుసంధానం
ఈ పరికరాలను మొబైల్ అప్లికేషన్ (mobile app for mosquitoes control) ద్వారా అధికారులకు యాక్సెస్ చేసేలా డాష్‌బోర్డుకు అనుసంధానం చేశారు. ఇలా చేయడం మూలంగా జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఎంటమాలజీ చీఫ్ , సీనియర్ అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బంది ఫాగింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలవుతుందని తెలిపారు. ఈ నూతన పరిజ్ఞానంతో ఫాగింగ్ యంత్రాలు ఒక రోజులో ఎన్ని ప్రాంతాలు.. ఎంత దూరం ప్రయాణించాయో కూడా తెలుకోవచ్చన్నారు. అదేవిధంగా సక్రమ పద్ధతిలో ఫాగింగ్ చర్యలు తీసుకోవడంలో సులభతరం అవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: