ETV Bharat / state

గ్రేటర్​లో విజృంభిస్తోన్న కరోనా... దృష్టిసారించిన బల్దియా - corona cases ion hyderabad

రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో... ఎక్కువగా గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో నమోదవుతుడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వైరస్​ కట్టడికి జీహెచ్​ఎంసీ పలు చర్యలు చేపడుతోంది.

ghmc foused on containment zones in Hyderabad

author img

By

Published : May 5, 2020, 8:22 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగం వరకు నగరంలోనివే కావడం వల్ల బల్దియా ప్రత్యేక దృష్టిసారిచింది. చార్మినార్ జోన్​లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్​లో నిన్నటి వరకు 332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాజిటివ్ కేసులు ఉన్న పరిధిలో మొత్తం 106 కంటైన్​మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ జోన్​లో కరోనా పాజిటివ్ కేసులు 16, కంటైన్​మెంట్ జోన్లు 14 ఉన్నాయి. నగరంలో అత్యధికంగా చార్మినార్ జోన్​లో 219 కేసులు నమోదు కాగా.. 52 కంటైన్​మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

ప్రత్యేకంగా కంటైన్​మెంట్ జోన్లలో రెండు సార్లు శానిటైజ్ చేసి... ఇంటింటికి తిరుగుతూ ఆరోగ్య స్థితిని గమనిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూమ్​కు రోజుకు వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. ఇవాళ 571 కాల్స్ వచ్చినట్లు జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.వికలాంగులకు, వృద్ధుల కోసం అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్​ ద్వారా 22 వేల 385 మందికి ఆహారం అందించినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: మరో ముగ్గురికి కరోనా..1085 చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.